క్రీడల్లో మహిళలు పెరగడం శుభపరిణామం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:40 AM
గతంతో పోల్చితే ప్రస్తుత రోజుల్లో మహిళలు క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామమని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ (పురుషులు, మహిళలు) ఛాంపియన్‌షిప్ కమ్ యూనివర్శిటీ టీమ్ సెలక్షన్ ట్రయల్స్ 2025-26 సోమవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్సులో నిర్వహించారు.
నన్నయ వీసీ ప్రసన్నశ్రీ
ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కమ్ టీమ్ సెలక్షన్
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గతంతో పోల్చితే ప్రస్తుత రోజుల్లో మహిళలు క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామమని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ (పురుషులు, మహిళలు) ఛాంపియన్‌షిప్ కమ్ యూనివర్శిటీ టీమ్ సెలక్షన్ ట్రయల్స్ 2025-26 సోమవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్సులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రసన్నశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జీవితంలో గెలుపు, ఓటమి సాధారణమైనవని, విద్యార్థులు తిరుగులేని విజయాలతో ముందుకు సాగేందుకు ఆత్మవిశ్వాసం చాలా అవసరమని అన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్‌కే మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడం కళాశాల ప్రతిష్టను పెంచుతుందన్నారు. వెటరన్ క్రీడాకారుడు రాజ్‌కుమార్ బాబు, కామాక్షి గ్రూప్ ఎండీ త్రిమూర్తులు, ఆర్ట్స్ కళాశాల అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ముళ్ల మాధవరావు, నన్నయ విశ్వవిద్యాలయం స్పోర్ట్సు బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ ఎంవీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన అథ్లెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.