అన్నవరంలో సీతారాములకు వేడుకగా వనవిహార మహోత్సవం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:45 AM
అన్నవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రత్నగిరి క్షేత్రపాలకులైన సీతారాముల దివ్య కల్యాణమహోత్సవాల్లో భాగంగా శుక్రవారం వనవిహారమహోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం 4గంటలకు నవదంపతులైన సీతారాములను, పెళ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మ వార్లను కొండపై నుంచి మేళతాలా

అన్నవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రత్నగిరి క్షేత్రపాలకులైన సీతారాముల దివ్య కల్యాణమహోత్సవాల్లో భాగంగా శుక్రవారం వనవిహారమహోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం 4గంటలకు నవదంపతులైన సీతారాములను, పెళ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మ వార్లను కొండపై నుంచి మేళతాలాలతో కొండదిగువన ఉన్న దేవస్థానం ఉద్యానవనానికి తోడ్కొనివచ్చారు. ప్రత్యేక వేదికలపై ఆశీనులు గావి ంచి పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. చతుర్వే పండితులు వేదాశీర్వచనాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివాహ బడలికలో ఉన్న నవదంపతులు సేదతీరేందుకు ప్రతీకగా ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కార్యక్రమంలో ఈవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం
సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం నవదంపతులకు చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలు ఉంటాయి.
కలశ పునఃప్రతిష్ఠ పూజలు
అన్నవరం దత్తత దేవాలయమైన నర్సీపట్నం మండలం బలిఘట్టం సత్యదేవుని ఆలయంలో శుక్రవారం కలశ పునఃప్రతిష్ఠ పూజలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ దత్తత సమయంలో కలశప్రతిష్ఠ చేపట్టగా వానరాలు వాటిని ధ్వం సం చేశాయి. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు శుక్రవారం అక్కడకు పండితులతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల య ఏఈవో కొండలరావు తదితరులు ఉన్నారు.