బిక్కవోలులో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:23 AM
బిక్కవోలు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజైన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీలక్ష్మీగణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు శ్రీలక్ష్మీగణపతికి మూలమంత్ర పూజలు, మంత్రజపతర్పణ, హావనములు, సావిత్రి పంటకోట ఉపషనిత్తు
బిక్కవోలు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజైన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీలక్ష్మీగణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు శ్రీలక్ష్మీగణపతికి మూలమంత్ర పూజలు, మంత్రజపతర్పణ, హావనములు, సావిత్రి పంటకోట ఉపషనిత్తు పారాయణాలు జరిపారు. హైకోర్టు ప్లీడర్లు స్వామి దర్శనానికి రావడంతో ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబారెడ్డి వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ అర్చకులతో ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి ని దర్శించుకున్నవారిలో హైకోర్టు జీపీ నాగరాజు నాగురు, పీపీలు మెండా లక్ష్మీనారాయణ, కైలార్‌కృష్ణ, ఏపీ జెన్‌కో జీపీ భూషణచౌదరి, కమర్షియల్ టాక్స్ జీపీ బొబ్బా స్వామికిరణ్, ఇరిగేషన్ జీపీ శ్యామ్‌సుందరరావు వున్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా మహిళలు బిక్కవోలులోని ప్రాచీన ఆలయాలకు పోటెత్తారు.