ప్రత్యేక అవసరాల పిల్లల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:50 AM
ప్రత్యేక అవసరాల పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బలభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
బిక్కవోలు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాల పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బలభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల డీఎస్సీలో డఫ్ అండ్ డమ్ టీచర్‌గా సెలక్టైన రంగంపేట మండలం దొడ్డిగుంటకు చెందిన సత్యంశెట్టి మ ణికంఠను, అతని ఐఈఆర్‌టీ టీచర్ ప్రసాద్‌ను ఎమ్మెల్యే సభలో అభినందించారు. శిబిరానికి వంద మంది హాజరు కాగా వీరికి పరీక్షలు జరి పి 84 మందికి ఉపకరణాలు అవసరమౌతాయని వైద్యులు గుర్తించారు.కార్యక్రమంలో ఎంపీ పీ తేతలి సుమ, సొసైటీ చైర్మన్లు ఎన్‌వీ సుబ్బారెడ్డి, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, సర్పంచ్ బుం గా రామారావు, ఐఈ ఆర్‌టీ కో ఆర్డినేటర్ కనకబాబు, ఎంఈవోలు సీహెచ్‌వీవీ సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, మూడు మండలాల ఐఈఆర్‌టీలు, ఐఈడీఎస్‌ఎస్ టీచర్లు పాల్గొన్నారు.
కాగా ఈనెల 15, 16 తేదీల్లో క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు బలభద్రపురం సచివాలయం-2లో క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు చేసిన ట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, దేశంలో పేరొందిన హోమీబాబా క్యా న్సర్ అండ్ రీసెర్చ్ వారు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయితే ఆరోగ్యశ్రీ ద్వారా గాని ఉచితంగా గాని వైద్యం అందిస్తారన్నారు.
నిధుల మంజూరుపై కృతజ్ఞతలు
రంగంపేట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షల మంజూరు చేయించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రామవరంలో బీసీ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. అనంతరం బీసీ నాయకులు నీలపాల త్రిమూర్తులు, గుత్తుల సుబ్రహ్మణ్యం, బలిరెడ్డి దుర్గారావు, పెం కే సుబ్బారావులను ఎమ్మెల్యే సత్కరించారు.
వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి
అనపర్తి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కూటమి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ తమ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించలేదని, హామీలను నెరవేరుస్తోందన్నారు. మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు ముం దుకు వస్తున్న దాతలను అవమానపరిచే విధం గా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నే పాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన నారా లోకేశ్‌ను విమర్శించే హక్కు జగన్‌కు లేదన్నారు. సమావేశంలో తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి శేషారత్నం, మల్లిడి ఆదినారాయణరెడ్డి, దత్తుడు శ్రీను, నూతిక బాబూరావు, ఒంటిమి సూర్యప్రకాష్, ఎన్‌ఆర్‌కే ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.