Share News

రాత్రి వేళల్లో గస్తీ పెంచండి

ABN , Publish Date - May 14 , 2025 | 12:42 AM

క్రైం టీంలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు అప్ర మత్తంగా ఉండాలని..ముఖ్యంగా రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడానికి గస్తీ పెంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ఆదేశించారు.

రాత్రి వేళల్లో గస్తీ పెంచండి
జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ కిశోర్‌

క్రైం టీమ్‌లు అప్రమత్తం కావాలి

క్రైం సమీక్షలో ఎస్పీ ఆదేశం

రాజమహేంద్రవరం, మే 13(ఆంధ్రజ్యోతి): క్రైం టీంలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు అప్ర మత్తంగా ఉండాలని..ముఖ్యంగా రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడానికి గస్తీ పెంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ఆదేశించారు. జిల్లా పోలీ స్‌ కార్యాలయంలో మంగళవారం ఆస్తి నేరా లపై సమీక్షించారు. రాత్రి సమయాల్లో అను మానాస్పదంగా సంచరించే వ్యక్తులను ప్రశ్నిం చడంతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ డివైజెస్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ల ద్వారా వివరాలను పరి శీలించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై పోలీసులకు సమాచారం ఇవ్వ డంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తుల నేరాల్లోని పాత నేరస్తులు,జైలు నుంచి విడుదల వుతున్న వాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న నిర్మానుష్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ డం తో పాటు రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ నిర్వ హించాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌, రాత్రి గస్తీలతో పాటు అసాంఘిక వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పటిష్టం చేయా లన్నారు.డ్రోన్‌ కెమెరాల వ్యవస్థ వినియో గిం చి నేరస్తులపై దృష్టి పెట్టాలన్నారు.కార్య క్ర మంలో డీఎస్పీలు, సీఐలు,ఎస్‌ఐలు, క్రైం, స్పె షల్‌ పార్టీ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:42 AM