డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:12 AM
యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు.
రాజమహేంద్రవరం కల్చరల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం పిలుపు మేరకు ఈగల్ టీం, ది రాజమండ్రి కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి నగరంలో ఇప్పటికే రెండు యాంటీ డ్రగ్స్ ఎడిక్ట్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పి స్తున్నామని తెలిపారు. మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తు న్న వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు. గంజాయి వినియోగదారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజా యి విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ, వైద్యుల చీటీ లేకుండా కొన్ని మందులు విక్రయించకూ డదన్నారు. అనంతరం జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్య క్షుడు పిల్లా బాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు, హోల్‌సేల్ అధ్యక్షుడు మహేంద్రనాథ్, సెక్రటరీలు ఫణీంద్ర, కృష్ణబాలాజీ, పెండెం రామూజీ, సంపత్‌కుమార్, లాలాధర్,డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ హరిహర తేజ,ఏఎస్పీ మురళీకృష్ణ(అడ్మినిస్ట్రేషన్),మెడికల్ షాపు యజమానులు తదితరులు పాల్గొన్నారు.