తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:07 AM
తుని రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వస్త్రాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా 36వ షోరూంను తునిలో ప్రారంభించింది. సినీ నటి ఐశ్వర్య రాజేష్, రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు) షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఐశ్వర్య రాజేష్, రేవంత్ షోరూంలో అ
పాల్గొన్న సిటీ నటులు ఐశ్వర్య రాజేష్, రేవంత్
తుని రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వస్త్రాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా 36వ షోరూంను తునిలో ప్రారంభించింది. సినీ నటి ఐశ్వర్య రాజేష్, రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు) షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఐశ్వర్య రాజేష్, రేవంత్ షోరూంలో అన్ని విభాగాలను సందర్శించి వివిధ వస్త్రాలను పరిశీలించారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో రకాల మోడల్స్, వస్త్రాలు అందుబాటులో ఉన్నా యన్నారు. అన్ని తరగతల వారికి అందుబాటు ధరల్లో వస్త్రాలు ఉండటం ఈ షోరూం ప్రత్యేకత అన్నారు. షాపింగ్ మాల్ చైర్‌పర్సన్ హోల్‌టైం డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తునిలో షోరూం ద్వారా 36 షోరూమ్‌లు మైలు రాయి దాటినందుకు సంతోషంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సిర్న రాజమౌళి మాట్లాడుతూ సరికొత్త వెరైటీలతో అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు తీసుకొచ్చామన్నారు. హోల్‌టైం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ సరికొత్త ఫ్యా షన్ ప్రపంచంగా సౌత్ ఇండియాషాపింగ్‌మాల్ పేరు గడించిందని, తుని పరిసర ప్రజలు తమ షోరూంను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు.