అరుదైన అందం ‘సోనియా’
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:00 AM
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 20( ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహే ంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణంలో ఉన్న సుమారు 500 ఏళ్లనాటి సౌత్ ఆఫిక్రా దేశానికి చెందిన బూరుగుజాతీ మహావృక్షం (అడన్ సోనియా డిజిటేటా) పుష్పించింది. ఎన్నో తరాలను చూసిన ఈ మహావృక్షం పువ్వులు కూడా తెల్లకలువ పువ్వూలను పోలిఉన్నాయి. ఈ మహావృక్షం కొమ్మల నుంచి కిందకు లాంతరు బుడ్డి మాదిరిగా వేలాడుతూ విచిత్రంగా కనిపించాయి. వాటి మొగ్గలు కూడా
రాజమహేంద్రవరంలో పుష్పించిన 500 ఏళ్లనాటి మహావృక్షం
తెల్లకలువనుపోలిన పూలు
10 తరాలను చూసిన చెట్టు
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 20( ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహే ంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణంలో ఉన్న సుమారు 500 ఏళ్లనాటి సౌత్ ఆఫిక్రా దేశానికి చెందిన బూరుగుజాతీ మహావృక్షం (అడన్ సోనియా డిజిటేటా) పుష్పించింది. ఎన్నో తరాలను చూసిన ఈ మహావృక్షం పువ్వులు కూడా తెల్లకలువ పువ్వూలను పోలిఉన్నాయి. ఈ మహావృక్షం కొమ్మల నుంచి కిందకు లాంతరు బుడ్డి మాదిరిగా వేలాడుతూ విచిత్రంగా కనిపించాయి. వాటి మొగ్గలు కూడా కాయలు మాదిరిగా కనిపించాయి. రాజమహేంద్రవరం సామ్రాజ్యంలో ముస్లిం వర్తకులు వా పారం రీత్యా ఇక్కడికి వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి ఈ మహావృక్షం మొక్కను తెచ్చి అప్పటి కోట గోడ సమీపంలో నాటడంతో అది పెరిగి మహావృక్షంగా మారి నాటి చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. ఈ పుష్పం పరిక్వత చెందాక వచ్చే కాయలు చింతకాయలు మాదిరిగా పుల్లగా ఉంటాయని, వాటిని విరోచనాలకు మందుగా వినియోగిస్తారని నాటు వైద్యు లు చెబుతున్నారు. ఇదే వృక్షాలు సౌత్ ఆఫిక్రాలో సు మారు రెండు వేల ఆడుగుల ఎత్తు పెరిగి అక్కడ ప్రజలకు నివాసాలుగా కూడా ఉప యోగపడుతుంటాయి. సు మారు 10 తరాలను చూసిన ఈ వృక్షాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులపై కూడా ఉంది.