Share News

సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:50 AM

ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ విలేజ్‌ వార్డ్‌ సెక్ర టేరియట్‌ ఉద్యోగుల సంఘం (ఏపీవీడబ్ల్యూఎస్‌జీఈఏ) డిమాండ్‌ చేసింది. సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇంటింటి సర్వేలు, అద నపు పనుల పేరుతో సచివాలయ ఉద్యోగులను ప్రధాన విధుల నుంచి తప్పిస్తున్నారని, ఇది ఉద్యోగుల్లో ఆం దోళన కలిగిస్తోందన్నారు.

 సమస్యలు పరిష్కరించండి
కోరుకొండలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న సచివాలయ ఉద్యోగులు

  • విలేజ్‌, వార్డు సచివాలయ ఉద్యోగులు

  • ఎంపీడీవోలకు వినతిపత్రాల సమర్పణ

బిక్కవోలు/కోరుకొండ/సీతానగరం, సెప్టెంబ రు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ విలేజ్‌ వార్డ్‌ సెక్ర టేరియట్‌ ఉద్యోగుల సంఘం (ఏపీవీడబ్ల్యూఎస్‌జీఈఏ) డిమాండ్‌ చేసింది. సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇంటింటి సర్వేలు, అద నపు పనుల పేరుతో సచివాలయ ఉద్యోగులను ప్రధాన విధుల నుంచి తప్పిస్తున్నారని, ఇది ఉద్యోగుల్లో ఆం దోళన కలిగిస్తోందన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తాము సిద్ధంగా ఉ న్నప్పటికీ, అసాధారణమైన పని ఒత్తి డిని ఎదుర్కొంటున్నామన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమ కు సకాలంలో ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, జూనియర్‌ అసిస్టెంట్‌కు సమానమైన హోదాను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు 10 గంటల పనివేళల నిబంధన అమలు చేయకపో వడం, సెలవు రోజుల్లో కూడా బలవంతంగా ప నిచేయమని ఒత్తిడి చేయడం రాజ్యాంగ విరుద్ధ మని పేర్కొన్నారు. ఈ మేరకు బిక్కవోలులో సచివాలయ ఉద్యోగుల అనపర్తి తాలూకా అధ్యక్షుడు తాడి రామగుర్రెడ్డి మండల ఉద్యోగులతో కలిసి వినతిపత్రాన్ని ఎంపీడీవో వి.శ్రీనివాస్‌కు అందజేశారు.సీతానగరంలో ఏపీవీడబ్ల్యూఎస్‌జీఈఏ జి ల్లా కో కన్వీనర్‌ బాలరజని ఆధ్వర్యంలో ఉద్యోగు లు ఇన్‌చార్జి ఎంపీడీవో మూర్తికి వినతిపత్రం అందించగా కోరుకొండలో ఎంపీడీవోకు ఉద్యోగు లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:50 AM