బాధిత కుటుంబానికి న్యాయం కోరుతూ నిరసన
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:15 AM
టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై మంగళవారం వారు ఆందోళన జరిపారు.

రావులపాలెం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై మంగళవారం వారు ఆందోళన జరిపారు. ఆత్రేయపురం మం డలం కట్టుంగకు చెందిన వందే విజయకుమారి(45) సోమవారం భర్త రమేష్‌బాబుతో కలిసి రావులపాలెం వైపు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఊబలంక వద్ద టిప్పర్‌లారీ ఢీకొనడంతో ఆమె మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీంతో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని వారితో చర్చలు జరపడంతో నిరసన విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.