సౌర..సా..గు!
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:11 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత లకు ఇకపై వ్యవసాయానికి విద్యుత్ బెంగ తీరనుంది. త్వరలో తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ వాడుకునే రోజులు రాబోతున్నాయి.

రైతులకు తీపికబురు
పగటిపూటే 9 గంటలు విద్యుత్
176 కోట్లతో సోలార్ ప్లాంట్లు
తూర్పు, కాకినాడల్లో ఏర్పాటు
కోనసీమలో స్థల ఇబ్బంది
ఏటా రూ.275 కోట్లు ఆదా
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత లకు ఇకపై వ్యవసాయానికి విద్యుత్ బెంగ తీరనుంది. త్వరలో తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ వాడుకునే రోజులు రాబోతున్నాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో రూ.176 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించ బోతోంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కేవలం పగటి పూట రైతులు వాడుకునేందుకు మాత్రమే సరఫరా చేయనుంది. తద్వారా రైతు లు విద్యుత్ కోసం రాత్రి వేళల్లో పడిగాపులు కాసే పరిస్థితులు తప్పనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 67 వేల కనెక్షన్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై వ్యవసా యంపై ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తున్నా రు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 68 వేల వరకు ఉన్నాయి. సాగుకోసం పక్కాగా విద్యుత్ వినియోగిస్తోన్న కనెక్షన్లు 47 వేలు ఉన్నాయి. వీరికి ప్రభుత్వం వ్యవసాయా నికి ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఉమ్మడి జిల్లాకు 2.99 లక్షల కిలోవాట్స్ లోడ్ అవసరం అవుతోంది. అంటే 493.22 మిలియన్ యూని ట్లు. ఈ మొత్తం విద్యుత్ అన్నదాతలకు ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్నందుకు ఏటా రూ. 275.20 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతోంది. ఇంత చేసినా తీవ్ర వేసవి సమయంలో వ్యవ సాయానికి సైతం కోతలు వేయాల్సిన పరిస్థితి. దీంతో పలుసార్లు పంటలు ఎండిపోయి అన్న దాతలు ఇబ్బంది పడుతున్నారు.
పోలవరం కాలువ వెంబడి..
ఇకపై సాగుకు విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకూడదనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ ఆదే శాలతో ట్రాన్స్‌కో అధికారులు సోలార్ విద్యు త్‌పై దృష్టిసారించారు. పీఎం కుసుం పథకం కింద సోలార్ విద్యుత్‌ను పగటిపూట తొమ్మిది గంటలపాటు సరఫరా చేయడానికి కొత్త ప్రతి పాదనలు సిద్ధం చేశారు. వీటి ద్వారా ఉత్పత్త య్యే విద్యుత్‌ను గ్రిడ్‌ను అనుసంధానించి దీన్ని పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో వ్యవసాయ విద్యుత్‌కు మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించారు. మొత్తం 44 మెగా వాట్ల సామర్థ్యంతో 16 చోట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారీ నుంచి తుని నియోజకవర్గంలోని తేటగుంట వరకు కాలువ వెంబడి 14 చోట్ల సోలార్ పవర్ ప్లాంట్లను రూ.160 కోట్లతో నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. కాలువ వెంబడి స్థలం ఐదు నుంచి పదెకరాల వరకు ఉన్న చోట్ల 8 మెగా వాట్లు, తక్కువ స్థలం ఉన్నచోట్ల రెండు నుంచి నాలుగు మెగావాట్ల వరకు సోలార్ పవర్ ప్లాంట్లను స్థాపించనున్నారు. రాజమహేంద్ర వరంలో కల్వచర్ల, జీవీకే పవర్ ప్లాంట్ ఈ రెండు చోట్ల రూ.8 కోట్లతో నాలుగు మెగావాట్ల సామర్థ్యంలో సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మిం చనున్నారు. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్ప త్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి పగటి పూట 9 గంటలపాటు రైతులకు అం దించనున్నారు. తద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 48 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు లబ్ధి కలగనుంది. అటు ప్రభుత్వానికి ఏటా ఉచిత విద్యుత్‌కు అయ్యే రూ.275 కోట్లు ఖర్చు ఆదా కానుంది. ఇక కోన సీమ జిల్లాలో రెండు ప్లాంట్ల నిర్మాణానికి ప్రతి పాదనలున్నా స్థల లభ్యత కష్టంగా మారింది. తొలి విడత ఈ రెండు జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఇవి అందుబా టులోకి వస్తే రైతులకు పగటిపూట తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా ఉండ దు. సోలార్ విద్యుత్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 47 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు లబ్ధి కలగనుండగా, కాకినాడ జిల్లాలోనే 24 వేల మందిరైతులకు సోలార్‌తో మేలు జరగనుంది.