826 మంది సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:01 AM
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 6 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన కౌశలం సర్వే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో సక్రమంగా సాగడంలేదని కమిషనర్ భావన సచివాలయం ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 826 మంది సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వే ప
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 6 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన కౌశలం సర్వే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో సక్రమంగా సాగడంలేదని కమిషనర్ భావన సచివాలయం ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 826 మంది సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వే పనులు 55 శాతం మాత్రమే జరగడంతో సచివాలయం సెక్రటరీల నిరక్ష్య వైఖరి మానుకోవాలని హెచ్చరించినట్టు సమాచారం. ఈ సర్వే ద్వారా నిరుద్యోగ యువత కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అటువంటి సర్వేను నిర్లక్ష్యం చే యడం సరికాదని సూచించినట్టు సమాచారం.