Share News

భూసార పరీక్షలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:11 AM

రైతు లు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించి, వాటి ఫలితాలకు అనుగుణంగా ఎరువుల యా జమాన్యం చేపడితే మేలైన దిగుబడులు పొంద వచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవ రావు పేర్కొన్నారు.

భూసార పరీక్షలు తప్పనిసరి
చక్రద్వారబంధంలో మాట్లాడుతున్న మాధవరావు

  • జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు

  • చక్రద్వారబంధంలో ‘పొలం పిలుస్తోంది’

రాజానగరం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రైతు లు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించి, వాటి ఫలితాలకు అనుగుణంగా ఎరువుల యా జమాన్యం చేపడితే మేలైన దిగుబడులు పొంద వచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవ రావు పేర్కొన్నారు. మండలంలోని చక్రద్వార బంధం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం భూసార పరీక్షలకు అధిక ప్రాధాన్యమివ్వడమే కాకుండా అధి కశాతం నిధులు కేటాయించిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలన్నారు. ప్రస్తుత వేస విలో పంట కోతలు పూర్తయిన వెంటనే భూసార పరీక్షలు ప్రారం భమవుతాయన్నారు. వేసవిలో జీలుగ, జనుము, పీఎండీఎస్‌ విత్త నాలు చల్లుకుని నేలను అధిగ ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవ డం ద్వారా భూసారం పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. సాగులో ఎరు వుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పరిరక్షిం చడంతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గించి ఆరోగ్యకరమైన, దిగుబడినిచ్చేలా పంటలు పండించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ డీఆర్‌సీ జయలక్ష్మి, ఏవో షేక్‌ ఇమామి ఖాసిం, హెచ్‌ఈవో అరవింద్‌ సాయి, వ్యవసాయ సహాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 01:11 AM