సహ‘కారం’
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:41 AM
ప్రభుత్వం ఏర్పడేందుకు మేం సహకరించాం.. ప్రభుత్వ సహకారం మాకు ఉంటుంది..అని పలువురు ఆశలు పెట్టుకున్నారు..
త్రీమెన్ కమిటీలకు ఝలక్
సొసైటీల్లో పర్సన్ ఇన్‌చార్జిలు
గత నెల 30న ముగిసిన గడువు
మరో ఆరు నెలలు పొడిగింపు
అయోమయంలో ఆశావహులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం ఏర్పడేందుకు మేం సహకరించాం.. ప్రభుత్వ సహకారం మాకు ఉంటుంది..అని పలువురు ఆశలు పెట్టుకున్నారు.. జూలై 30న పర్సన్ ఇన్‌చార్జిల పాలన ముగిసింది.. దీంతో త్రీమెన్ కమిటీల్లో ఛాన్స్ దక్కుతుందని ఆశించా రు.. అయితే ప్రభుత్వం మాత్రం సొసైటీలపై ఆశలు పెట్టుకున్న నాయకులకు షాక్ ఇచ్చింది. మరో ఆరు నెలలు వారినే కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేయడంతో నేతలంతా గరం..గరంగా ఉన్నారు.. సొసైటీల్లో పెత్తనం కోసం ఎదురుచూస్తున్న నేతలకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అధికార కూటమిలోని తెలుగుదేశం,జనసేన, బీజేపీ ్టనేత లకు గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం సొ సైటీ పాలకవర్గాల్లో ఆయా పార్టీ నేతలను నా మినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో వైసీపీ నేతలతో కమిటీలను నియ మించింది.తెలుగుదేశం కూటమి అధికా రంలోకి వచ్చాక వాటిని రద్దు చేసి..అఫీషియల్ కమిటీ లను నియమించింది. ఇటీవల ఆయా సొసైటీ లకు కూటమి నేతలను నామినేట్ చేసే ప్రక్రి య మొదలైంది. కొన్ని సొసైటీలకు ఇప్పటికే త్రీమెన్ కమిటీలను నియమించారు. కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి.
173 సొసైటీలకు పాతవారే..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొద్ది రోజుల కిందట సుమారు 173 సొసైటీ లకు త్రీమెన్ కమి టీలను నియ మించారు. అందులో ఒకరు చైర్ పర్సన్, ఇద్దరు డైరెక్టర్లు ఉం టారు. గతజూలై 30కి పాత పాలకవర్గాల గడువు ముగియడంతో మరో ఆరు నెలల పాటు పొడి గిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.ఇప్పటికే త్రీ మెన్ కమిటీల నియామకమైన సొసైటీల్లో వారే కొన సాగుతారు.కమిటీలు లేని చోట పర్శన్ ఇన్‌చార్జి కొనసాగుతారు.2013లో సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. తర్వాత వాటికి ఎన్నికలు నిర్వ హించలేదు. అప్పటి నుంచి కమిటీలను నియ మిస్తూ నెట్టుకొస్తున్నారు.
166 సొసైటీలకు ప్రతిపాదనలు
తూర్పుగోదావరి జిల్లాలో 83 సొసైటీలు, కాకి నాడలో 24, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 59 మొత్తం 166 సొసైటీలకు త్రీమెన్ కమి టీలను నియమించాల్సి ఉంది. మూడు జిల్లాల్లో పదవులకు తీవ్ర పోటీ ఉండడంతో ఎమ్మె ల్యే లు, ఇన్‌చార్జిలు చర్చించుకుని..అందరికీ నచ్చ చెప్పి ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు కాస్త ముందుగా వెళ్లి ఉంటే అన్ని సొసైటీలకు త్రీమెన్ కమిటీలు ఈ పాటికే నియామకం పూర్తయ్యేది.ప్రస్తుతం ఆయా ని యోజకవర్గాల నుంచి వెళ్లిన ప్రతి పాదనలు పార్టీ అధిష్ఠానానికి చేరాయి. అక్కడ పెద్దలు కూర్చుని మళ్లీ చర్చించే అవకాశం ఉంది.ఈ సభ్యుల వివరాలు కోరుతూ ఆయా జిల్లాలో సహకార శాఖ అధికారులకు జాబి తాలు వస్తా యి.వాటిని పరిశీలించి..ఆయా సొసైటీల ద్వారా సొసైటీ సభ్యులుగా అర్హులేనా అనే సమా చా రం సేకరిస్తారు.ఫైనాన్స్, ఎరువుల వ్యా పారం చేస్తున్నా, సొసైటీల్లో బకాయిలు ఉన్నా, సొసైటీలోని ఉద్యోగులకు ఎవరైనా బంధువులై ఉన్నా వారు అనర్హుల వుతారు. ఇటువంటి జాబితాలు ఇంకా సహకార శాఖ అధికారులకు చేరలేదు. కానీ ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న కమిటీలను ఎప్పుడో నియమిస్తే అప్పటి నుం చి త్రీమెన్ కమిటీలు అధికారంలోకి వస్తాయి. వారు వచ్చే జనవరి 30వ తేదీ వరకూ అధి కారంలో ఉంటారు. అప్పటి లోపు ఎన్నికలు జరిగితే కొత్త పాలకవర్గాలు వస్తాయి. ఎన్ని కలు జరగకపోతే మరో ఆరు నెలల పాటు త్రీమెన్ కమిటీలే కొనసాగుతాయి. ప్రస్తుతం ప్రతిపాదనలన్నీ కొద్ది రోజులు ముందుగా వెళ్లి ఉంటే ఇవాళ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగించే అవసరం లేకపోయేది. ఒక్కో సొసైటీకి ముగ్గురు వంతున నియామకం వల్ల వందలాది మంది పార్టీనేతలకు పదవులు వచ్చే వి.కానీ ప్రస్తుతం కొంత వెయిటింగ్ తప్పదు.