Share News

వైభవంగా ఆంజనేయస్వామి శోభాయాత్ర

ABN , Publish Date - May 26 , 2025 | 01:00 AM

ముమ్మిడివరంలోని పోలమ్మ చెరువుగట్టు, నగర పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న అభయాంజనేయస్వామి శోభాయాత్ర ఆదివారం వైభవంగా సాగింది.

వైభవంగా ఆంజనేయస్వామి శోభాయాత్ర

ముమ్మిడివరం, మే 25(ఆంధ్రజ్యోతి): ముమ్మిడివరంలోని పోలమ్మ చెరువుగట్టు, నగర పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న అభయాంజనేయస్వామి శోభాయాత్ర ఆదివారం వైభవంగా సాగింది. హనుమాన్‌ జన్మదినోత్స వం సందర్భంగా ఈ నెల 22న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం నాటి శోభాయాత్రతో ముగిశాయి. ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి ఆయా వీధుల్లో తీన్మార్‌ వాయిద్యాలు, బుట్టబొమ్మల వేషధారణలు, బాణసంచా కాల్పులతో ఆయా ప్రాంతాల్లో ఊరేగించారు. నగర ప్రముఖులంతా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుదర్శనం శ్రీరామ చిరంజీవాచార్యుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు జరిపించి మధ్యాహ్నం శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో తాడి నరసింహారావు, ఎం.బాలకృష్ణ, కట్టా సత్తిబాబు, కె.రామలింగేశ్వరరావు, గంజి జాజి, సరిపెల్ల శ్రీనివాసరాజు, పేరిచర్ల వాసురాజు, వెత్సా వీరేష్‌, సి.వెంకటేశ్వరరావు, సుతాపల్లి అజయ్‌కుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 01:00 AM