Share News

భయపెట్టేసింది!

ABN , Publish Date - May 14 , 2025 | 12:29 AM

ముమ్మిడివరం, మే 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఓ గృహంలో తాచుపాము హల్‌చల్‌ చేసి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుపతి చిన్నీ నివాసం గృహంలోకి తాచుపాము చేరి హల్‌చల్‌ చేయడంతో ఇంట్లోనివారు, చుట్టుపక్కలవారు భయభ్రాంతుల

భయపెట్టేసింది!
తాచుపామును పట్టుకున్న స్నేక్‌క్యాచర్‌ గణేష్‌వర్మ

ముమ్మిడివరంలో తాచుపాము హల్‌చల్‌

ముమ్మిడివరం, మే 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఓ గృహంలో తాచుపాము హల్‌చల్‌ చేసి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుపతి చిన్నీ నివాసం గృహంలోకి తాచుపాము చేరి హల్‌చల్‌ చేయడంతో ఇంట్లోనివారు, చుట్టుపక్కలవారు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్‌క్యాచర్‌ గణేష్‌వర్మకు గృహ యజమాని చిన్నీ సమాచారం అందించడంతో పామును చాకచక్యంగా బంధించాడు. వేసవి తాపానికి పాములు బయటికి వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్మ సూచించాడు. పాము కనిపిస్తే తనకు సమాచారం అందించాలని, వాటిని ఎవరూ చంపవద్దని విజ్ఞప్తి చేశాడు.

Updated Date - May 14 , 2025 | 12:29 AM