Share News

ప్రత్తిపాడులో పాము కాట్లు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:36 AM

ప్రత్తిపాడు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో మంగళ వారం వేర్వేరు చోట్ల నలుగురు వ్యక్తులు పాము కాట్లకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో శరభవరం గ్రామానికి చెందిన కు ట్టు మిషన్‌ కార్మికుడు గొణగాల నరసింహ మూర్తి మంగళవారం సాయంత్రం మిషన్‌ వద్ద పనిచేస్తుండగా తాచుపాము కాటు వేసింది. దీంతో స్పృహ కోల్పోయిన అతడిని వెంటనే కుటు ంబ సభ్యులు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్‌ సెం టర్‌కు తరలిం

ప్రత్తిపాడులో పాము కాట్లు
ప్రత్తిపాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ఒకేరోజు వేర్వేరు చోట్ల నలుగురిని కాటేసిన సర్పాలు

ప్రతిపాడు ఆసుపత్రిలో బాధితులు

ప్రత్తిపాడు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో మంగళ వారం వేర్వేరు చోట్ల నలుగురు వ్యక్తులు పాము కాట్లకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో శరభవరం గ్రామానికి చెందిన కు ట్టు మిషన్‌ కార్మికుడు గొణగాల నరసింహ మూర్తి మంగళవారం సాయంత్రం మిషన్‌ వద్ద పనిచేస్తుండగా తాచుపాము కాటు వేసింది. దీంతో స్పృహ కోల్పోయిన అతడిని వెంటనే కుటు ంబ సభ్యులు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్‌ సెం టర్‌కు తరలించారు. అలాగే గజ్జనపూడి, పెద్ద శంకర్లపూడి గ్రామాలకు చెందిన రైతులు బొబ్బిలి వీరబాబు, పి.వీరవెంకట సత్యనారాయణ సాయ ంత్రం పొలం పనుల్లో పాముకాట్లకు గురయ్యా రు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి బంధు వులు తరలించారు. అలాగే ఎర్రవరం గ్రామానికి చెందిన పి.వీరబాబు పొలంలో నుంచి వస్తుం డగా కట్లపామును గమనించకుండా తొక్కేశాడు. దీంతో పాటు కాటు వేసింది. కంగారుతో కేకలు వేయడంతో స్థానికులు కట్ల పామును చంపేపి బాధితుడిని మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నలుగురికి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ సౌమ్య మైకేల్‌, సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. ఒక్కొ క్కరికి 20 యాంటీ ఫైనల్స్‌ ఇంజక్షన్‌లు ఇచ్చామ ని, ప్రాణాలు కాపాడడానికి రాత్రంతా చికిత్స అందించనున్నామని సౌమ్య మైకేల్‌ తెలిపారు.

Updated Date - Oct 08 , 2025 | 12:36 AM