చేతికి ‘స్మార్ట్’గా..
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:07 AM
ఈనెల 25 నుంచి ఉమ్మడి జిల్లాలో కొత్త స్మార్ట్ రేషనకార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. పాత, కొత్త లబ్ధిదారు లందరికీ కలిపి ఒకేసారి వీటిని నియోజక వర్గాలు, మండలాల్లో అందించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన ఫొటోతో చాంతాడంత రేషనకార్డు జారీ చేసి వైసీపీ సొంత ప్రచారం చేసుకుంది. దీని స్థానంలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం స్మార్ట్ రేషనకార్డు ఇవ్వబోతోంది.
కొత్త స్మార్ట్ రేషన కార్డులొచ్చేస్తున్నాయ్
ఈనెల 25 నుంచి మండలాల వారీగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 17.41 లక్షల పాతకార్డుల స్థానంలో కొత్తవి అందజేత
ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో 34 వేల మంది కొత్త లబ్ధిదారులకూ
కార్డులపై లబ్ధిదారుడి ఫొటో, కుటుంబ సభ్యుల పేర్లు.. కొత్తవారికీ రేషన
ఏటీఏం కార్డు తరహాలో ఉండే రైస్‌కార్డులపై క్యూఆర్ కోడ్‌లు కూడా..
ఈనెల 25 నుంచి ఉమ్మడి జిల్లాలో కొత్త స్మార్ట్ రేషనకార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. పాత, కొత్త లబ్ధిదారు లందరికీ కలిపి ఒకేసారి వీటిని నియోజక వర్గాలు, మండలాల్లో అందించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన ఫొటోతో చాంతాడంత రేషనకార్డు జారీ చేసి వైసీపీ సొంత ప్రచారం చేసుకుంది. దీని స్థానంలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం స్మార్ట్ రేషనకార్డు ఇవ్వబోతోంది. అచ్చం ఏటీఎం కార్డు తరహాలో ఉండే కార్డులపై కేవలం లబ్ధిదారుడి పేరు, ఫొటో మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే కొత్త కార్డుదారులకు సైతం ఈనెల నుంచే రేషన పంపిణీ చేయనున్నారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలు పేరుతో ఎడాపెడా లబ్ధిదారులను కోసే శారు. రకరకాల నిబంధనల పేరుతో చివరకు రేషనకార్డులను సైతం భారీగా ఏరేశారు. పలు పథకాలకు రేషనకార్డు అర్హత కావడంతో పెరి గిన ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి కార్డుల ను గుట్టుచప్పుడు కాకుండా అప్పటి ప్రభుత్వం ఏరేసింది. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 15.69లక్షల తెల్లకార్డులుండగా, వీటిలో అనర్హులు అధికంగా ఉన్నారని భావించి 28,500 మంది కార్డుదారుల పేరుతో జాబితాను జిల్లాల పౌరసరఫరాలశాఖ లకు పంపి గుట్టుగా క్షేత్రస్థాయి తనిఖీలు చేసి కార్డులు రద్దుచేసింది. 17,500 మంది కార్డుదా రులు సొంత గ్రామాల్లో నివసించడం లేదనే కారణంతో వాటినీ రద్దు చేసేశారు. కొత్తగా వివాహం అయిన దంపతులు, కార్డు ఉండి కొత్తగా పిల్లలున్న వారు ఇలా అనేక విభాగాల్లో కార్డులు జారీ చేయడం, మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నవి వేలల్లో ఉన్నా అదేం పట్టిం చుకోలేదు. చిరుద్యోగాలు చేసుకునేవారు తమ తల్లిదండ్రుల కార్డుల్లోంచి తమపేర్లు తొలగించా లని కోరినా ఏవేవో కారణాలు చూపి పథకా లను నిలిపివేసింది. దీంతో జనం రేషన కార్డుల విషయంలో పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనేకసార్లు ప్రజలు అప్పట్లో గ్రీవెన్ససెల్‌లో కూడా భారీగా కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తవి మంజూరు చేయాలంటూ వినతులు అందించినా జగన సర్కారు చెవికెక్కించుకో లేదు. మరోపక్క అప్పట్లో ఉన్న రేషనకార్డులను రద్దుచేసి ఏకంగా అప్పటి సీఎం జగన ఫొటోతో కార్డులు జారీచేసింది. ప్రతి కార్డుదారుడికి జగన ఫొటోతో కాగితం ముక్క చేతిలో పెట్టిం ది. తద్వారా రాజకీయంగా ఈ కార్డుల ద్వారా లబ్ధిపొందేందుకు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీఎం చంద్రబాబు కార్డుదారుల కష్టాలను పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. రేషన కార్డుల్లో మార్పు లు, చేర్పులు చేపట్టడానికి పచ్చజెండా ఊపా రు. అదే సమయంలో రేషనకార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర అధికారులు కలిపి ప్రభుత్వ ఆమోదంతో స్మార్ట్‌కార్డుల జారీకి నిర్ణయించారు. ఈ కొత్తకార్డులపై గత ప్రభుత్వం తరహాలో సీఎం బొమ్మ లేకుండా కేవలం కార్డు దారుడి ఫొటోలే ఉండేలా జాగ్రత్తలు తీసుకు న్నారు. కార్డులపై కార్డుదారుడి పేరు, చిరునామా, మిగిలిన సభ్యుల పేర్లు ఉండేలా వీటిని తీర్చి దిద్దారు. ప్రస్తుతం వీటి ముద్రణ దాదాపు పూర్త యింది. వీటిని ఈనెల 23లోగా జిల్లాలకు ప్రభు త్వం పంపనుంది. వీటిని ఈనెల 25 నుంచి జిల్లా స్థాయిలో మంత్రి, నియోజకవర్గాల్లో ఎమెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అటు మండలాల్లోను సమాంత రంగా కొత్తస్మార్ట్‌కార్డులను లబ్ధిదారులకు అందిం చనున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 6,41, 533, తూర్పుగోదావరి జిల్లాలో 5,63,089, కోనసీ మ జిల్లాలో 5,36,575 కార్డుదారులున్నారు. వీరం దరికి కొత్తస్మార్ట్ కార్డులు అందజేయనున్నారు.
మరో 34 వేల మందికి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మొత్తుకున్నా పేదలకు కొత్త రేషనకార్డుల జారీ పెద్దగా ఇవ్వలేదు. మార్పులు, చేర్పులను సైతం పట్టించుకోలేదు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్తకార్డులకు ప్రభుత్వం మే 14 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో రేషనకార్డుల కోసం ప్రజల నుంచి అర్జీ లు స్వీకరించింది. కొత్తగా వివాహం అయినవారు, ఇప్పటివరకు రేషనకార్డు లేనివారు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు, ఆధార్ తప్పు గా నమోదైనవారు.. ఇలా ఏడు రకాల సేవల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త రేషనకార్డు లు కావాలంటూ వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన అర్జీల్లో అత్యధికంగా కార్డు ల్లో కొత్త సభ్యులను చేర్చాలంటూ కోరినవే ఉన్నా యి. వీటన్నింటిని సచివాలయాల స్థాయిలో వీఆర్వో నుంచి తహశీల్దార్ల వరకు ఆ అర్జీలను పరిశీలించి మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తి చేశారు. అందులోభాగంగా కాకినాడ జిల్లాకు కొత్త గా 13 వేలు, కోనసీమ 11 వేలు, తూర్పుగోదా వరి 10 వేల కొత్త రేషన కార్డులను ప్రభుత్వం మంజూరుచేసింది. వీరికి కూడా ఈనెల 25 నుంచే స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. అటు రేషన కూడా ఈ నెల్లోనే కొత్తకార్డుదారులు పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క కొత్త రేషనకార్డులను రైస్‌కార్డుల పేరి ట ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వీటిని పూర్తి గా ఏటీఏం కార్డు తరహాలో కొత్తగా డిజైన చేశా రు. వీటికి క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది. రేష న దుకాణంలో సరుకులు తీసుకున్న తర్వాత డీల ర్ సేవలు ఎలా ఉన్నాయి? డబ్బులు అడుగుతు న్నారా? వంటి ఫిర్యాదులను సైతం క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి కార్డుదారులు తెలపవచ్చు. ఎలాంటి ప్రచార్భాటం లేకుండా ప్రభుత్వ చిహ్నం తో కార్డుల అందజేతపై హర్షం వ్యక్తమవుతోంది.