Share News

ఉపాధి లక్ష్యాల్లో స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ భేష్‌

ABN , Publish Date - May 17 , 2025 | 12:48 AM

యువతకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా ఏపీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తోందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ తెలిపారు.

ఉపాధి లక్ష్యాల్లో స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ భేష్‌

అమలాపురం, మే 16(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా ఏపీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తోందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని సిల్క్‌ డెవలెప్‌మెంట్‌ కార్యాలయంలో ఎండీ జి.గణేష్‌కుమార్‌తో ఎంపీ భేటీ అయ్యారు. దీనిలో భాగంగా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ మిషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అప్‌ స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌ కార్యకలాపాల పురోగతి, ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై చర్చించారు. ఈప్రాజెక్టులో ఎదుర్కొంటున్న సమస్యలను సవాళ్లను, వాటి పరిష్కార మార్గాలపై గణేష్‌కుమార్‌తో హరీష్‌ చర్చించారు. యువతను నైపుణ్యంతో తీర్చిదిద్ది, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈలక్ష్యాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆత్మనిర్భర్‌ భారతదేశం దిశగా ముందుకు వెళ్లేందుకు దోహదపడుతుందని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:48 AM