Share News

అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:20 AM

మలికిపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన కడలి కరుణ, కడలి రేవతి అక్కాచెల్లెళ్లు. వారిద్దరు ఎస్‌ఐ కోచింగ్‌ తీసుకుని ఒకేసారి ఎంపికయ్యారు. వారికి మోకా సత్తిబాబు కోచింగ్‌ సెంటర్‌ నందు ఉచిత కోచింగ్‌ అవకాశం కల్పించారు. అక్కాచె

అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు
ఎస్‌ఐలు కరుణ, రేవతి

మలికిపురం మహిళలకు ఎస్‌ఐలుగా ఒకేచోట పోస్టింగ్‌

మలికిపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన కడలి కరుణ, కడలి రేవతి అక్కాచెల్లెళ్లు. వారిద్దరు ఎస్‌ఐ కోచింగ్‌ తీసుకుని ఒకేసారి ఎంపికయ్యారు. వారికి మోకా సత్తిబాబు కోచింగ్‌ సెంటర్‌ నందు ఉచిత కోచింగ్‌ అవకాశం కల్పించారు. అక్కాచెల్లెళ్లు ఎస్‌ఐలుగా ఎంపికవ్వగా విజయవాడసిటీ పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్‌ లభించింది. వారి తండ్రి వెంకటేశ్వర్లు చికెన్‌ సెంటర్‌ నందు పనిచేస్తుండగా తల్లి గృహిణి. వారికి ఎస్‌ఐలుగా పోస్టింగ్‌ రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 07 , 2025 | 12:20 AM