Share News

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:09 AM

తునిరూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వి ద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య అన్నారు. కాకినాడ జిల్లా తునిలో శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల 49వ వ్య వస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా 2 రోజుల పాటు విద్యాసంస్థల శాఖలైన తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినా

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో గాయని కౌసల్య

ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య

తునిరూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వి ద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య అన్నారు. కాకినాడ జిల్లా తునిలో శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల 49వ వ్య వస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా 2 రోజుల పాటు విద్యాసంస్థల శాఖలైన తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం విద్యార్థులకు గాతా రహే మేరా దిల్‌ పేరిట పాట పోటీలను నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా గాయని కౌసల్య, కీ బోర్డు ప్లేయర్‌ రవి శేఖర్‌ వ్యవహరించారు. కౌసల్య మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలు పా ఠశాల యాజమాన్యం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం తన పాటలతో అలరించారు. విజేతలు, అతిథులకు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ బహుమతులు అందజేశారు. సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎంవివిఎస్‌ మూర్తి, వివిఎస్‌ఎస్‌ భాను మూర్తి, డాక్టర్‌ ఎ.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 12:09 AM