Share News

ఆపరేషన్‌ సిందూర్‌ విజయం భారత్‌కు గర్వకారణం

ABN , Publish Date - May 17 , 2025 | 12:44 AM

ఆపరేషన్‌ సింధూర్‌ విజయం భారత్‌కు గర్వకారణమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు.

  ఆపరేషన్‌ సిందూర్‌ విజయం భారత్‌కు గర్వకారణం

పి.గన్నవరం, మే 16(ఆంధ్రజ్యోతి):ఆపరేషన్‌ సింధూర్‌ విజయం భారత్‌కు గర్వకారణమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయ వంతంపై పి.గన్నవరంలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. పి.గన్నవరం త్రీరోడ్‌ సెంటర్‌ నుంచి 600అడుగుల జాతీయ జెండాతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులతో పాటు మాజీ ఆర్మీ జవాన్లు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని సైన్యానికి, భారత్‌ మాతకు జేజేలు పలికారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ నామన రాంబాబు, తహశీల్దార్‌ పి.శ్రీప ల్లవి, ఎంపీడీవో కేవీ ప్రసాద్‌, టీడీపీ నియోజక వర్గ పరిశీలకులు షేక్‌ సుభాన్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి డొక్కా నాథ్‌బాబు, ఎంపీపీ గనిశెట్టి నాగ లక్ష్మి, మోకా ఆనంద సాగర్‌, శిరిగినీడి వెంకటేశ్వ రరావు, చీకరమిల్లి వెంకటేశ్వరరావు, పాలూరి సత్యనందం, వాసంశెట్టి కుమార్‌, బొంతు పెద బాబు, సంసాని పెద్దిరాజు, మోల్లెటి శ్రీనివాస రావు,సాధనాల శ్రీవెంకటసత్యనారాయణ, జాలెం శ్రీనివాస రాజా, గణపతి వీరరాఘవులు, బొండా డ నాగమణి, అంబటి భూలక్ష్మి, తాటి కాయల శ్రీనివాసరావు, శేరు శ్రీనుబాబు, పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:44 AM