Share News

జలకళ

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:01 AM

మోతుగూడెం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. జలాశయాలకు సుమారు 14 టీఎంసీల నీరు చేరిందని జెన్‌కో అధికారులు లెక్కగడుతున్నారు. బలిమెల జలాశయానికి సుమారు 11టీఎంసీలు చేరినట్టు తెలి పారు. ఏవీ

జలకళ
నిండుగా ఉన్న డొంకరాయి జలాశయం

నిండిన సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని జలాశయాలు

మోతుగూడెం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. జలాశయాలకు సుమారు 14 టీఎంసీల నీరు చేరిందని జెన్‌కో అధికారులు లెక్కగడుతున్నారు. బలిమెల జలాశయానికి సుమారు 11టీఎంసీలు చేరినట్టు తెలి పారు. ఏవీపీ డ్యాం, డొంకరాయి జలాశయానికి సుమారు 7వేల క్యూసెక్కుల చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోం ది. సీలేరుకు 1500క్యూసెక్కులు, బలిమెల జలాశయానికి సు మారు 9500 క్యూసెక్కులు వస్తున్నాయి. జోలాపుట్‌, బలిమెలలో ప్రస్తుతం ఉన్న 45.90 టీఎంసీల్లో 25.39టీఎంసీలు ఆంధ్రా వాటాగా ఉంది. డొంకరాయి, గుంటవాడ జలాశయాల్లో ప్ర స్తుతం ఉన్న 9.71టీఎంసీలతో కలిపి మన రాష్ట్రం వాటాగా 35.10 టీఎంసీల నిల్వలు ఉన్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అదేశాల మేరకు సీలేరు కాంప్లెక్స్‌లోని అన్ని విద్యుత్తు కేంద్రాల్లో నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 9.36 మిలియ న్‌ యూనిట్ల విద్యుత్పత్తి జరుగుతోంది.

Updated Date - Aug 02 , 2025 | 01:01 AM