Share News

సుఖీభవకు సంసిద్ధం!

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:13 AM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథ కాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ధగాతో మోస పోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించిం ది.

 సుఖీభవకు సంసిద్ధం!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఎట్టకేలకు అనేక వడపోతల అనంతరం వ్యవసాయశాఖ అధికారులు అర్హులైన అన్నదాతల జాబితా సిద్ధంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతుల జాబితాలను గ్రామ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతుల ఈకేవైసీలు పూర్తిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ చెల్లింపులు చేస్తున్నవారు, భూస్వాముల పేర్లపై పూర్తిగా వడపోత ద్వారా తుది జాబితా ఖరారు చేశారు. అందులోభాగంగా ఉమ్మడి జిల్లాలో 3.97,938 లక్షల మంది రైతులు పథకం పరిధిలోకి వస్తున్నట్టు గుర్తించారు. వీరందరి ఈకేవైసీలు పూర్తిచేసి సుఖీభవ పథకం డబ్బులు జమ చేయడానికి వీలుగా జాబితా తయారు చేశారు. పథకం అమలుకు ఉమ్మడి జిల్లాకు రూ.636 కోట్ల వరకు అవసరం కానుంది. ఈనెల తొలి వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లో డబ్బుల జమచేయనుంది.

ఉమ్మడి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు పూర్తి

ఎట్టకేలకు సిద్ధమైన అర్హుల జాబితా

3.97,938 లక్షల మంది రైతుల ఈకేవైసీలు ఖరారు

ఈనెల మొదటివారంలోనే కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి అన్నదాతాల ఖాతాల్లో జమ

పథకం వర్తించని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటి నుంచి అవకాశం

తద్వారా అర్హుల జాబితాకు అదనంగా మరో 4 వేల మంది జతవుతారని అంచనా

పథకం అమలుకు ఉమ్మడి జిల్లాకు రూ.636 కోట్ల వరకు నిధులు అవసరం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథ కాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ధగాతో మోస పోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించిం ది. ఈ నేపథ్యంలో గతనెల్లో ప్రభుత్వం జిల్లాల వారీగా రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధి కారులకు పంపింది. జాబితా ప్రకారం రైతుల్లో అర్హులు ఎందరు? అనర్హులు ఎందరో తేల్చాలని ఆదేశించింది. దీంతో దాదాపు మూడు వారాలు జిల్లాల వారీగా అధికారులు గ్రామస్థాయిలో రైతు ల వివరాలు పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, భూస్వాములు, ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న వారి వివరాలను స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించారు. వీటిని పరిశీ లించి అర్హులైన రైతులను గుర్తించారు. ఆతర్వాత వీరి ఈకేవైసీ కూడా పూర్తిచేశారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పథకానికి 3,97,938 మంది రైతులు అర్హులుగా లెక్క తేల్చారు. వీరందరి ఈ కేవైసీలు అన్నీ పక్కాగా నిర్ధారించి డబ్బులు జమ చేయడానికి వీలుగా జాబితా ఖరారు చేశారు. ఇందులో కాకినాడ 1.49,764 మంది రైతులు పథకానికి అర్హత సాధించారు. అయితే ఇదివరకు ప్రభుత్వం పంపిన జాబితాను క్షుణ్ణంగా పరిశీ లించగా 21వేల మంది అనర్హులుగా తేలారు. వీటిని మినహాయించి మిగిలిన రైతుల వివరా లను పరిశీలించి అర్హులుగా ఖరారు చేశారు. కోన సీమ జిల్లాలో 1,34,797 మంది రైతులు అర్హులు గా నిర్ధారణ అయ్యారు. అత్యధికంగా లబ్ధిదారు లు ఐ.పోలవరం మండలంలో 6,140 మంది ఉ న్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,13,377మంది అర్హులుగా తేలారు. 1,962మంది వివిధ కారణా లతో అనర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 98 శాతానికి పైగా రైతుల వివరాలు ఈకేవైసీ పూర్తి అయింది. మరోపక్క పథకానికి ఇంకా కొం దరు అనర్హులుగా ఉన్న నేపథ్యంలో వీరి నుంచి అర్జీలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మ్యుటేషన్లు ఇంకా పూర్తికాని రైతులు, ఈనాం భూములు, ఆధార్‌ సీడింగ్‌ జరగని రైతులు వేగంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం మంగళవారం నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అర్హుల పేర్లను పంపేలా వ్యవసాయ శాఖకు లాగిన్‌లో అవకాశం కల్పిం చింది. దీంతో స్థానిక రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు స్వీకరించి పరిశీలన అనంతరం అర్హుల జాబితాలోకి చేర్చనున్నారు. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఖరారైన జాబితాకు అదనంగా నాలుగు వేల మంది వరకు జతయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో పథకం అమలుకు కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.636 కోట్ల వరకు నిధులు వెచ్చించాల్సి ఉంది.

గతంలో మాదిరి కాకుండా..

వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేవలం కేంద్ర వాటాతో కలిపి రూ.13,500 ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పైగా అప్పట్లో రైతు భరోసా పేరుతో ఇచ్చిన డబ్బులు కూడా వాయి దాలపై వాయిదా వేస్తూ సకాలంలో డబ్బులు ఇవ్వకుండా అన్నదాతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కొందరికే డబ్బులు ఇచ్చి మిగిలిన వారికి నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయకుండా ఉసురుపోసుకుంది. నిధుల భారం తో అర్హులైన రైతులను పథకం నుంచి తప్పిం చేసి తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేసిం ది. దీంతో అన్నదాతలు వైసీపీ ప్రభుత్వం తీరుపై అప్పట్లో ఎక్కడికక్కడ నిలదీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఉండడడానికి చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్నికల హామీలో భాగంగా ప్రక టించారు. అర్హులైన ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యం లో ఇటీవల బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 6,300 కోట్లు కేటాయించారు. అటు పథకం కూడా అర్హులైన రైతులు ఎంతమంది ఉంటే అంతమందికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. బడ్జెట్‌ సాకుతో కోతలు వేయ కుండా అర్హులందరినీ పథకంలోకి చేర్చాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. అయితే పథకం అమలు ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తోన్న తరుణంలో మంగళవారం కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు తీపికబురు అందించారు. కేంద్రం త్వరలో ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. దీంతో రైతుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 03 , 2025 | 01:13 AM