Share News

నౌ..కాశ్రయం!

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:01 AM

కాకినాడలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పా టు కు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వా నికి చెందిన హిందుస్థాన్‌ షిప్‌ యార్డు లిమి టెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) ఇక్కడ శాటిలైట్‌ షిప్‌ యార్డు నిర్మాణానికి మొగ్గు చూపుతోంది.

నౌ..కాశ్రయం!

అనువైన ప్రాంతానికి అన్వేషణ

110 ఎకరాలకు ప్రతిపాదన

బుధవారం ప్రతినిధుల పర్యటన

డీప్‌వాటర్‌పోర్టులో పరిశీలన

రూ.900 కోట్లతో కేంద్రం

అన్నీ కుదిరితే పెద్ద ప్రాజెక్టు

మారిటైంబోర్డు సానుకూలత

మూలపేటపైనా కసరత్తు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పా టు కు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వా నికి చెందిన హిందుస్థాన్‌ షిప్‌ యార్డు లిమి టెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) ఇక్కడ శాటిలైట్‌ షిప్‌ యార్డు నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. ఈ మేరకు హెచ్‌ఎస్‌ఎల్‌ అధికారికంగా ధ్రువీకరిం చింది.ఈ నేపథ్యంలో కాకినాడలో అనువైన భూ ముల లభ్యత ఎక్కడ ఉందనేది పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఓ సంస్థ ఎప్పటి నుంచో నౌకలు తయారు చేస్తుండడం,ఇక్కడున్న సాను కూల వాతావరణంతో కాకినాడే ఖాయమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాకినాడ అనువైన ప్రాంతం

నౌకల నిర్మాణం చేపట్టడానికి సముద్రపు అలల తాకిడి తక్కువగా ఉన్న ప్రాంతం చాలా కీలకం.ఇది కాకినాడలో ఉంది. పైగా ఒకప్పుడు బ్రిటిష్‌ యుగంలో కోరంగి వద్ద నౌకల తయారీ, మరమ్మతులు జరిగేవి. అప్పుడే ఈ రంగంలో కాకినాడ పేరొందింది. కానీ ఆ తర్వాత పెద్దగా ఈ రంగం కాకినాడలో విస్తరించలేదు. నౌకల తయారీకి సముద్రానికి ఆనుకుని విశాలమైన భూములు అవసరం. వీటిలో నౌకలు, బార్జీలు, టగ్‌లు తయారు చేసి ఆ పక్కనే ఉన్న సముద్ర జలాల్లోకి వీటిని దించి పరీక్షలు చేసి సరుకు రవాణాకు వినియోగిస్తారు.ఈ అనుకూల వాతావరణం కాకినాడలోనే ఉంది. సీఫ్రంట్‌గా పిలిచే ఈ సౌకర్యం కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి నుంచి యాంకరేజ్‌ పోర్టు వరకు రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇన్ని సాను కూలతలు కాకినాడకు ఉన్నాయి.

గతంలో చాలా కంపెనీలు..

గతంలో కాకినాడలో షిప్‌యార్డు నిర్మించ డానికి సింగపూర్‌ కంపెనీ ముందుకు వచ్చింది. కాకినాడ సీపోర్టులో కొంతకాలం కార్యకలాపాలు నిర్వ హించింది. వివిధ దశల్లో రూ.1,725 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రోత్సాహం కరువై ఇక్కడ యార్డును మూసేసింది. ఎల్‌అండ్‌టీ కంపెనీ 2006లో కాకినాడలో షిప్‌యార్డు నిర్మా ణానికి ముందుకొచ్చింది. రూ.2 వేల కోట్ల పెట్టు బడితో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక చెన్నైకు వెళ్లిపోయింది. 2020లో రూ.7 కోట్ల కాకినాడ స్మార్ట్‌సిటీ నిధు లతో జగన్నాథపురం సమీపంలో అధికారులు బోట్‌ బిల్డింగ్‌ యార్డు నిర్మించారు.ఇందులో ఒకే సారి 18 వరకు భారీ బోట్లు తయారుచేసే వసతులు సిద్ధం చేశారు. కానీ తగిన ప్రోత్సా హం లేక అదీ ఈసురోమంటోంది. కొచ్చిన్‌, గోవా, మజ్‌గావ్‌లో హిందుస్థాన్‌ షిప్‌యార్డులు 100 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో నౌకలను నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం కాకినాడలో శాన్‌మెరైన్‌ అనే సంస్థ ఎన్నో ఏళ్లుగా చిన్న, మధ్య తరహా నౌకలు, బార్జీలు, టగ్‌లు నిర్మిస్తోంది. గతేడాది 8వేల టన్నుల భారీ నౌకను నిర్మించింది. వచ్చే ఐ దేళ్లలో మరో 25 వరకు నిర్మించి దేశ వ్యాప్తంగా పలు కంపెనీలకు అందివ్వడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ హిందుస్థాన్‌ షిప్‌ యార్డుతోను పలు ఒప్పందాలు చేసుకుంది.

సీఎంను కలిశారు..

రాష్ట్రంలో భారీ నౌకల నిర్మాణం విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్‌ షిప్‌ యార్డు చేపడుతోంది.ఇది మినహా షిప్‌యార్డు మరెక్కడా భారీగా లేదు. త్వరలో మరో షిప్‌ యార్డు నిర్మించడానికి కాకినాడ అనువైనదిగా భావిస్తోంది.110 నుంచి 150 ఎకరాల భూ ములు ఉన్న చోట షిప్‌యార్డు నిర్మాణం చేప డతామని హెచ్‌ఎస్‌ఎల్‌ సీఎండీ ఖత్రీ ప్రక టించారు.ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి తమ ప్రతిపాదన వివ రించారు.షిప్‌యార్డుకు కాకినాడే అనువైనదిగా ఆ సంస్థ భావిస్తోంది.

ఓకే అంటే రూ.900 కోట్లు

బుధవారం డీప్‌వాటర్‌పోర్టు ఏరియాలోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను హిం దుస్థాన్‌ షిప్‌యార్డు ప్రతినిధులు పరిశీ లిం చారు.భూముల లభ్యత.. సముద్రానికి ఎంత దూరం వంటివన్నీ పరిశీలించారు. ఇక్క డే ఉన్న మారీటైం బోర్డు అధికారులతోను సమా వేశమయ్యారు.ఈ నేపథ్యంలో త్వరలో నిర్ణ యం తీసుకోనున్నారు. ఒకవేళ కాకినాడలో భూములు ఓకే అయితే రూ.900 కోట్ల వరకు హిందుస్థాన్‌ షిప్‌యార్డు ఇక్కడ పెట్టుబడులు పెట్టనుంది. ప్రస్తుతం రక్షణశాఖకు అవసర మైన అన్నిరకాల యుద్ధ,ఇతర నౌకలను హెచ్‌ ఎస్‌ఎల్‌ నిర్మిస్తోంది. భారత నావికాదళంతో రూ.19 వేల కోట్ల విలువైన భవిష్యత్తు ఆర్డర్లు ఈ సంస్థకు ఉన్నాయి.ప్రస్తుతం విశాఖలో ఉన్న షిప్‌యార్డుకు బ్రాంచ్‌ యార్డుగా కొత్తది నిర్మిం చనున్నారు. తద్వారా నౌకల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని ఈ సంస్థ ఆలోచన. కాకినాడతో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేట తీర ప్రాం తాన్ని హెచ్‌ఎస్‌ఎల్‌ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది.దాదాపుగా కాకినాడవైపే హెచ్‌ ఎస్‌ఎల్‌ ఎక్కువ ఆసక్తి చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ సానుకూల తతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రక టించిన ఏపీ మారిటైం పాలసీకి కాకినాడ కేం ద్రంగా ఉన్న రాష్ట్ర మారిటైం బోర్డు కార్యాల యం నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడే భూముల కేటాయింపు జరిగేలా పర్యవేక్షిస్తోంది.

Updated Date - Jul 31 , 2025 | 01:05 AM