షైనింగ్ స్టార్స్ స్ఫూర్తిగా నిలవాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:16 AM
విద్యారంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జల వనరుల మంత్రి నిమ్మల రామానా యుడు పేర్కొన్నారు.

పది,ఇంటర్ విద్యార్థులకు సత్కారం
జిల్లాలో 169 మంది స్టార్స్
నగదు,ప్రశంసాపత్రం అందజేత
ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యం
స్మార్ట్ వర్క్ అవసరం : మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): విద్యారంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జల వనరుల మంత్రి నిమ్మల రామానా యుడు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంట ర్మీ డియట్ పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన 169 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్-2025 పేరుతో రాజమహేంద్రవరం నారా యణదాస సవా సమితిలో నిర్వహించిన సత్కా ర కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యకు అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. విద్య శ్రమ,క్రమశిక్షణతోనే అల వడుతుందని చెప్పారు. షైనింగ్ స్టార్ సత్కారం తొలి మెట్టుగా భావించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 5088 మంది విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తు న్నామన్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రతి విష యంలోనూ దూరదృష్టితో వ్యవహరిస్తున్నార న్నారు. తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున నగదు ప్రో త్సాహకం, మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేశా రు. పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కం దుల దుర్గేష్ మాట్లాడుతూ హార్డ్ వర్క్‌కి బదులుగా స్మార్ట్ వర్క్ అవసరమని అన్నారు.షైనింగ్ స్టార్స్ తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ప్రజా సేవలో తమకు కూడా ప్రతిభా పురస్కారాలు దక్కాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో క్వాం టమ్ కంప్యూటింగ్ రంగంలో రూ.2 బిలియన్ల ఎకానమీ సాధించడానికి, 5 వేల ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పది ఫలితాల్లో గత ఏడాది 23వ స్థానంలో ఉన్న జిల్లాను ఈసారి 6వ స్థానానికి తీసుకెళ్లడం హర్షనీయమన్నారు.కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ షైనింగ్ స్టార్ సత్కారం తొలి మెట్టుగా భావించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యా జీవితంలో విజయ ప రంపర కొనసాగించాలన్నారు. ప్రభుత్వ పథ కా లు, అవకాశాలు అందిపుచ్చుకొని ఎదుగు దలకు బాటలు వేసుకోవాలన్నారు. విద్యలో స్పర్ధ, వ్యాపారంలో వైరం ఉండాలని అంటారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. విద్యా ద్వారానే సమానత్వం సిద్ధిస్తుందన్నారు. ఓ బాలిక ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపులో రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలోనే నిలిచి తన వద్దకు రాగా.. ఆమె ప్రైవేటు కళాశాల విద్యార్థి అను కున్నానని.. కానీ నిడదవోలు ప్రభుత్వ కళాశాల విద్యార్థి అని చెప్పారు.ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది ఒక రుజువని పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రష్టు పట్టించిన రంగాల్లో విద్యా రంగం కూడా ఒకటన్నారు. చివ రికి బెల్టులపై కూడా జగన్ పేరు రాసుకునే వారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ వంటి మహనీయుల పేర్లతో విద్యా ర్థులకు మంచి మెసేజ్‌ను ఇస్తోందన్నారు. హాస్టళ్లలో ఫలితాలు మెరుగు పడాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదు పాయాలను ఉచితంగా కల్పిస్తున్నారని.. ప్రైవేటు పాఠశాలల్లో చేరి డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమి టీలను ఏర్పాటు చేసిన ఘనత నాటి ప్రధాని వాజ్‌పేయికి దక్కుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.అవార్డులు పొందిన విద్యార్థులు మరింత మందికి స్ఫూర్తి దాయకంగా నిలవా లన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ చిన్న రాముడు, కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవోలు కృష్ణ నాయక్, రాణి సుస్మిత, డీఈవో కె.వాసు దేవరావు, ఆర్‌జేడీ జి.నాగమణి, ఆర్‌ఐవో నరసి ంహం,తల్లిదండ్రులు,టీచర్లు పాల్గొన్నారు.