Share News

ఎగసిపడుతున్న సముద్రం..

ABN , Publish Date - May 27 , 2025 | 01:42 AM

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాజోలు దీవిలో సముద్రంలో ఆదివారం రాత్రి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉవ్వెత్తున కెరటాలతో సముద్రం ముందుకు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.

ఎగసిపడుతున్న సముద్రం..
తోటల్లోకి చేరిన నీరు

పొంగుతున్న మేజర్‌ డ్రెయిన్‌.. రాజోలు దీవిలో ఉవ్వెత్తున అలలు

మలికిపురం, మే 26(ఆంధ్రజ్యోతి): వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాజోలు దీవిలో సముద్రంలో ఆదివారం రాత్రి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉవ్వెత్తున కెరటాలతో సముద్రం ముందుకు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. వాతావరణ పరిస్థితులతోపాటు తీరంలో వచ్చిన మార్పులు దీనికి కారణమని చెబుతున్నారు. అలల తీవ్రతకు భూమి భారీగా కోతకు గురవుతోంది. సముద్రంలో అలలు ఉధృతికి శంకరగుప్తం డ్రెయిన్‌ సైతం పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా నివాస ప్రాంతాలతో పాటు కొబ్బరి తోటల్లోకి, రోడ్లపైకి కూడా ఉప్పునీరు ముంచెత్తుతూ వస్తోంది.

Updated Date - May 27 , 2025 | 01:42 AM