Share News

సముద్ర పోటుతో కొబ్బరిచెట్ల వినాశనం

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:05 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దివి ప్రాంతంలో ఉన్న కేశనపల్లి, తూర్పుపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రపునీరు పోటు వల్ల కొబ్బరిచెట్లు అధికంగా చనిపోతున్నాయని అం బాజీపేట డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిశోధన కేంద్ర అధిపతి డాక్టర్‌ ఎం. ముత్యాలనాయుడు చెప్పారు. ఉద్యానపరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారుల బృం దం ఆ ప్రాంతాలను మంగళవారం పరిశీలించింది.

సముద్ర పోటుతో కొబ్బరిచెట్ల వినాశనం
శంకరగుప్తంలో కొబ్బరిచెట్లను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల బృందం..

  • శంకరగుప్తం కొబ్బరితోటల్లో అంబాజీపేట శాస్త్రవేత్తల బృందం పర్యటన

అంబాజీపేట, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దివి ప్రాంతంలో ఉన్న కేశనపల్లి, తూర్పుపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రపునీరు పోటు వల్ల కొబ్బరిచెట్లు అధికంగా చనిపోతున్నాయని అం బాజీపేట డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిశోధన కేంద్ర అధిపతి డాక్టర్‌ ఎం. ముత్యాలనాయుడు చెప్పారు. ఉద్యానపరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారుల బృం దం ఆ ప్రాంతాలను మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం అధి పతి డాక్టర్‌ ముత్యాలనాయుడు మాట్లాడుతూ జిల్లాలోని శంకరగుప్తం కాలువ వెంబడి ఉన్న పెద్ద ప్రాంతమన్నారు. ఆ ప్రాంతంలో కొబ్బరిచెట్లు 40 సంవత్సరాలపైబడి ఉన్నాయన్నారు. 2017 నుంచి ఆ ప్రాంతంలో కాలువ ద్వారా సముద్రపు ఉప్పునీరు వెనక్కి రావడంతో కొబ్బరి చెట్లు ఎక్కువగా మరణిస్తున్నాయన్నారు. ఈ కాలువద్వారా నీరు మళ్లేందుకు 9 కిలోమీటర్ల మేర మాత్రమే తవ్వకాన్ని చేపట్టారన్నారు. ప్ర భావిత ప్రాంతం తీరానికి శంకరగుప్తం దగ్గర గా ఉండడంతో ఆటుపోట్లు సమయంలో సముద్రపు నీరు అక్కడ ఉన్న కాలువలోకి ప్రవేశించి అనంతరం పక్కనే ఉన్న కొబ్బరి తోట్లలోకి పొం గి ప్రవహిస్తోందన్నారు. 2017 నుంచి నేల, భూగర్భ జలాల లవణీయత పెరిగిందని, ఇది పంట ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ విషయంలో నేల, ప్రభావిత పొలాల మట్టినమూనాలను సేకరించడం జరిగిందన్నారు. పీహెచ్‌, విద్యుత్‌ వాహకత, ఇతర కీలకమైన భౌతిక రసాయన పరిమితులను అధ్యయనం చేశారన్నారు. శంకరగుప్తం డ్రైనేజీ కాలువ తవ్వకాల ఆపరేషన్‌ను వీలైనంత త్వ రగా పూర్తిచేయాలని, ఈ సమస్యను అధిగమించేందుకు చేలల్లో జీలుగ, పచ్చిరొట్ట ఎరువు పంటనువేసి కలియదున్నడం, జిప్సం వేయడం వంటివి సిఫార్సు చేయాలని ఉద్యాన శాఖాధికారులకు సూచించారు. శాస్రవేత్తలు డి.వెంకటస్వామి, పెదబాబు, గోవర్దనరావు, ఉద్యాన వన అధికారి శైలజ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 01:05 AM