Share News

స్క్రబ్‌ టైఫస్‌ అంటువ్యాధి కాదు

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:30 AM

నివాసాల వద్ద పిచ్చి మొక్క లు, చెత్త పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాటిలో పెరిగే ఎలుకలు, కీటకాల వల్ల వచ్చే బాక్టీరియాతో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకే ప్రమాదం ఉందని జిల్లా వైద్యశాఖ సర్వైవల్‌ అధికారి డా రాజీవ్‌ అన్నారు.

స్క్రబ్‌ టైఫస్‌ అంటువ్యాధి కాదు
మలకపల్లిలో బాధిత మహిళ ఇంటి వద్ద పరిశీలిస్తున్న వైద్యాధికారులు

తాళ్లపూడి, డిసెంబరు 15 (ఆంధ్ర జ్యోతి) : నివాసాల వద్ద పిచ్చి మొక్క లు, చెత్త పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాటిలో పెరిగే ఎలుకలు, కీటకాల వల్ల వచ్చే బాక్టీరియాతో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకే ప్రమాదం ఉందని జిల్లా వైద్యశాఖ సర్వైవల్‌ అధికారి డా రాజీవ్‌ అన్నారు. మండలంలోని మలక పల్లి గ్రామంలో సోమవారం పర్యటిం చారు. బాధిత మహిళను పరిశీలించి వైధ్యాధికారులు, సిబ్బందికి పలు సూచ నలు చేశారు. ఇటీవల మలకపల్లికి చెందిన మహిళకు జ్వరం సోకగా ఫీల్డ్‌ సిబ్బంది ఆమెను పరిశీలించి వైద్యశా లకు తరలించి పరీక్షలు చేసి స్క్రబ్‌ టైఫస్‌ వ్యాఽధిగా గుర్తించారన్నారు. జిల్లా అధికారుల సూచనలతో వైద్యం చేయగా ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. గ్రామంలో వ్యాఽధి సోకిన ప్రదేశాలను, నివాసాలను పరిశీలించారు.స్క్రబ్‌ టైఫస్‌ అంటువ్యాధి కాదని, అంత ప్రమాకరం కాదన్నారు. ఎలుకలు, నల్లుల ద్వారా స్క్రబ్‌ టైఫస్‌ వచ్చే అవకాశం ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని సూచించారు. పంచాయితీ సిబ్బంది తో ఆయా ప్రదేశాలలో బ్లీచింగ్‌ చల్లించా రు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డా అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:30 AM