Share News

మూతప‘డెన్‌’!

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:50 AM

రైల్వే స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది.

మూతప‘డెన్‌’!
మూతపడిన రైల్వే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ కేంద్రం

ఇద్దరు సిబ్బంది మధ్య గొడవలే కారణం

పట్టించుకోని ఉన్నతాధికారులు

6 నెలలుగా ఆగిన శిక్షణ

అయోమయంలో తల్లిదండ్రులు

భయంకరంగా మారిన పరిసరాలు

శిక్షణకు తల్లిదండ్రుల డిమాండ్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రైల్వే స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇద్దరు ఉద్యోగుల మధ్య వైరం చినికి చినికి పిల్లలకు శిక్షణ ఆగిపోయే వరకూ వెళ్లిం ది. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచీ డెన్‌ (శిక్షణ ఇచ్చే ప్రదేశం)కి తాళాలు వేసి ఉన్నా పట్టించుకొనే అధికారి కానరావడం లేదు. ఈ గొడవల కారణంగా తర్ఫీదు తర్వాత సంగతి.. పిల్లల సమయం పాడవుతుందనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు శిక్షణను పక్కన పెట్టేశారు. ఎంతో విశిష్ఠత ఉన్న సంస్థ పట్టాలు తప్పడం.. చిన్న పాటి సమస్యను పరిష్కరించలేని అధికా రుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది.

ఐదేళ్ల నుంచి శిక్షణ..

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో ఐదేళ్ల నుంచీ 25 ఏళ్ల వరకూ వివిధ అంశాల్లో ఆదివారాలు,బడుల సెలవు రోజుల్లో తర్ఫీ దు ఇస్తారు. దాదాపుగా మిలిటరీ ట్రైనింగ్‌ మాదిరిగానే ఉంటుంది. రోజూ ఉదయం, సాయంత్రం యోగా నేర్పి స్తారు. శారీరక దారుఢ్యంతో పాటు క్రమ శిక్షణ, మానసిక స్థైర్యం, ధైర్యం అలవడ తాయి. 25 ఏళ్లు వచ్చే సరికి సామర్థ్యాన్ని బట్టి రాష్ట్రపతి అవార్డు అందుకుంటారు. శిక్షణలో వివిధ ప్రాంతాల్లో క్యాంపులకు తీసుకెళతారు.రైల్వేతో పాటు ఇతర శాఖ ల్లోని ఉద్యోగ నియా మకాల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కి ప్రత్యేక కోటా ఉం టుంది.రాజమహేంద్రవరంలో ఈ కోటా లో ఉద్యోగం వచ్చిన వారు ఇద్దరు ప్రస్తు తం పనిచేస్తున్నారు. విజయవాడ డివిజన్‌ ఉద్యోగాల్లో ఇతర డివిజన్ల వాళ్లకు అవ కా శమిస్తుండడంతో ఇక్కడ శిక్షణ తీసుకున్న వాళ్లకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన ఉంది.

ఏం జరిగింది?

దక్షిణ మధ్య రైల్వేలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగానికి రాజమండ్రి రైల్వే స్టేషన్‌ తూర్పు వైపున డెన్‌కి రైల్వే ప్రదేశాన్ని కేటా యించింది. సుమారు 30 వరకూ సిమెంటు బెంచీలను ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచో శిక్షణ ఇస్తున్న ఇన్‌స్ట్రక్టర్‌ని కాదని మూ డేళ్ల కిందట వచ్చిన మరో వ్యక్తి అజమా యిషీ చేయడం మొదలుపెట్టాడు. గ్రూపు గొడవలు అతని వల్లనే మొదలయ్యాయని చెబుతున్నారు. ఈ గలాటాలో డెన్‌కి తాళం పడింది. ఇక్కడ శిక్షణ తీసుకునే వాళ్లకు ఒక వాట్సాప్‌ గ్రూపు ఉంది. అయితే గందరగోళం వల్ల ఆ గ్రూపు నుంచి చాలా మంది తొలగి పోయారు. ఇప్పు డు ఎందరున్నారనే విషయం కూడా అయో మయంగానే ఉందని చెప్పవచ్చు. చివరికి అసి స్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌ కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఆయన కార్యా లయానికీ తాళం పడింది. గందరగోళానికి కారణమైన ఉద్యోగిని అధికారులు బదిలీ చేశారు. ఆపై డెన్‌ని పట్టిం చుకోకుండా వదిలేశారు. దీంతో ఇక్కడ పరిస రాలు భయానకంగా తయారయ్యాయి. రాత్రి వేళ మాట అటుంచితే పగటి వేళ కూడా ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరి గితే బయటకు తెలియడం కష్టమనే చెప్పారు. ఈ డెన్‌ మూతబడిన సుమారు ఓ నెలకు ఒక వ్యక్తి ఇదే డెన్‌లోని ఓ చెట్టుకింద సిమెంటు బెంచీలో విగతజీవిగా మారాడు. 15 రోజుల తర్వాత ఈ దారుణం వెలుగుచూసింది. ఇంత అభద్రత ఉన్నా రైల్వే అధికారులు ఈ డెన్‌ విషయంలో ఈనాటికీ మేల్కొనలేదు. డెన్‌ మెయిన్‌ గేటుకు తాళం వేయడంతో మరో దారి అనధికారికంగా ఏర్పడింది.దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగు తున్నా యి.అధికారులు స్పందించి స్కౌట్స్‌ శిక్షణ ఆరం భించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:50 AM