Share News

భళా..బాలకా!

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:21 AM

విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు.

భళా..బాలకా!
జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసిన ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌ చిత్రంలో డీఈవో వాసుదేవ రావు, సత్యసాయి గురుకులం కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ గురవయ్య, ఉపాధ్యాయులు తదితరులు

జిల్లా నుంచి 230 ప్రదర్శనలు

రాష్ట్రస్థాయికి 11 ఎంపిక

విద్యార్థులకు అభినందన

రాజమహేంద్రవరం, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైద్యవిజ్ఞాన ప్రదర్శనను ప్రారం భించి సైన్స్‌ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు చదువు తో పాటు వివిధ రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల్లో సృజనా త్మకతను ప్రోత్సహించాలని, పరిశోధనల పట్ల వాళ్లలో ఆసక్తిని పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌ పేర్కొన్నా రు.తాను ఈ స్థితిలో ఉండడానికి తనకు చదు వు చెప్పిన గురువులే కారణమన్నారు. భావి శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా ఎదగడానికి విద్యా ర్థి దశ నుంచే పునాది పడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 ప్రాజెక్టులు ప్రదర్శించగా 11 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.

రాష్ట్రస్థాయికి ప్రదర్శనలు..

విద్యార్థుల గ్రూపు కేటగిరీలో గోపాలపురం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం కె.నవీన, కె.గీతికశ్రీ, రేగులగుంట జడ్పీహెచ్‌ఎస్‌ సీహెచ్‌ గురుసాయిరాం, సీహెచ్‌.రియాజై, జడ్పీ హెచ్‌ ఎస్‌ పురుషోత్తపల్లి డి.కీర్తన, కె.సత్య, జడ్పీ హెచ్‌ఎస్‌ రంగంపేట జి.భాస్కరి, ఎం.సీత, సీతానగరం మండలం రామచంద్రాపురం జడ్పీ హెచ్‌ఎస్‌ కె.వర్షిత్‌ కుమార్‌, ఎస్‌.సిద్ధార్థ, రాజ మండ్రి లూథరన్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ ఆర్‌.సం పత్‌, డి.జోసెఫ్‌ చరణ్‌, రంగంపేట జడ్పీ హెచ్‌ఎస్‌ బి.పల్లవి,ఎం.దీక్షిత, వ్యక్తిగత విభా గంలో రంగంపేట జడ్పీహెచ్‌ఎస్‌ కె.పూర్ణ వసుధ, ఉండ్రాజవరం జడ్పీహెచ్‌ఎస్‌ ఎస్‌.సు మశ్రీ సాయి, టీచర్స్‌ కేటగిరీలో పురుషోత్తపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ కేఎస్‌ఆర్‌.ఆంజనేయులు, రాజ మండ్రి ఎస్‌కేవీటీ బీబీ.విజయకుమారి ప్రద ర్శనలు రాష్ట్రస్థాయికి వెళ్లాయని తెలిపారు.

Updated Date - Dec 23 , 2025 | 01:21 AM