ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:38 AM
రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్‌కే ముఖ్య అతిథిగా వి చ్చేసి మాట్లాడారు.
ఘనంగా మాజీ రాష్ట్రపతి జయంతి
నాయకులు, అధికారుల నివాళి
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 15( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్‌కే ముఖ్య అతిథిగా వి చ్చేసి మాట్లాడారు. భౌతికశాస్త్ర విభాగాధిపతి సీహెచ్ కోమలలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త, హైదరాబాద్ స్ర్పెక్ట్రమ్ బయో సైన్సెస్ డైరెక్టర్ ఆర్.నాగేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రసాయనశాస్త్ర విభాగాధిపతి టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గణితశాస్త్ర విభాగం, కంప్యూటర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి సందర్భంగా ఆర్-లాంగ్వేజ్‌పై వర్కుషాపు నిర్వహించారు.
రాజమహేంద్రవరం కల్చరల్...
స్థానిక సీపీ బ్రౌన్ మందిరం అధ్వర్యంలో నం దం గనిరాజు జంక్షన్‌లోని అబ్దుల్ కలామ్ విగ్ర హానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆరోధృ తి వ్యవస్థాపకురాలు కోసూరి చండీప్రియ మా ట్లాడుతూ శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి స్థాయికి ఎదగడం వెనుక ఆయన నిర్విరామ కృషిని, పట్టుదలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. సన్నిధానం శాస్త్రి మాట్లాడుతూ అకలి మంటలు అనుభవించి ఎదిగిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలామ్ అని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది కేఎల్ భవాని, బిల్డర్ గంగుల భాస్కరరావు, మాదేటి ప్రకాష్, సీహెచ్ భాస్కరశాస్త్రి పాల్గొన్నారు. స్థా నిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కలామ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌పీ గంగిరెడ్డి, జీవీఎస్ నాగేశ్వరరావు, పి.సాయి, బీహెచ్ రమాదేవి, ప్రిన్సిపాల్ సీహెచ్ ఫణికుమార్, ఎస్‌కె రహమాన్, ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.