Share News

కీచక కరస్పాండెంట్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:40 AM

రాయవరం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థినిని బెదిరించి లోబర్చుకుని గర్భవతిని చేసిన కీచక స్కూల్‌ కరస్పాండెంట్‌ ఆకుమర్తి జయరాజ్‌ను అరెస్టు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి తెలిపారు. బుధవారం డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం పో లీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమేశ్వరం శివారు రెడ్డి కృష్ణమ్మపేటకు చెందిన ఆకుమర్తి జయరాజ్‌ రాయవరం మండలంలోని ఓ గ్రామంలో స్కూ

కీచక కరస్పాండెంట్‌ అరెస్ట్‌
రాయవరం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడిస్తున్న ట్రైనీ డీఎస్పీ, సీఐ

రాయవరం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థినిని బెదిరించి లోబర్చుకుని గర్భవతిని చేసిన కీచక స్కూల్‌ కరస్పాండెంట్‌ ఆకుమర్తి జయరాజ్‌ను అరెస్టు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి తెలిపారు. బుధవారం డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం పో లీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమేశ్వరం శివారు రెడ్డి కృష్ణమ్మపేటకు చెందిన ఆకుమర్తి జయరాజ్‌ రాయవరం మండలంలోని ఓ గ్రామంలో స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బాలికను ఈ ఏడాది మార్చి 26న తన ఆఫీసు రూమ్‌లోకి పిలిపించుకుని అలమారలో ఫైల్స్‌ తీమమని చెప్పాడు. త ర్వాత నోరునొక్కి కేకలు వేస్తే చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు నెలసరి రాకపోవడంతో ఈనెల 28న తల్లిదండ్రు లు వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రాయవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం రామచంద్రపురం మండలం కొత్తూరు శివారు జంక్షన్‌ వద్ద వీఆర్వో సమక్షంలో అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తె లిపారు. సమావేశంలో మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు, ఎస్‌ఐ డి.సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ట్రైనీ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అదనపు ఎస్పీ ఏవీఆర్‌బీ ప్రసాద్‌, డీఎస్పీ రఘువీర్‌ తదితరులు అభినందించారు.

Updated Date - Jul 31 , 2025 | 12:40 AM