స్కూల్ బస్సు బోల్తా
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:03 AM
జగ్గంపేట రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాం డ్రేగులలో ఓ ప్రైవేట్ స్కూల్ బోల్తాపడింది. జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు మంగళవారం కాండ్రేగుల నుంచి జగ్గం పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు

నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆరుగురికి స్వల్ప గాయాలు
జగ్గంపేట రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాం డ్రేగులలో ఓ ప్రైవేట్ స్కూల్ బోల్తాపడింది. జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు మంగళవారం కాండ్రేగుల నుంచి జగ్గం పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుం ది. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. స్వల్ప గాయాలైన ఆరుగురు విద్యార్థులను ప్రథమ చికిత్స అనం తరం ఇంటికి పంపించేశారు. తీవ్ర గాయాలైన నలుగురిని రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో తోటకూర కార్తీక్ నాగేంద్ర, తోటకూర అనిత రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిగా ఉన్నారు. విద్యార్థులంతా 6 నుంచి 9 తరగతిమధ్య చదువుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. విద్యార్థులను జగ్గంపేట జనసేన ఇన్‌చార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎమ్మార్వో జేవీఆర్ రమేష్ పరామర్శించారు. బుదిరెడ్డి రాంబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రఘునాధరావు తెలిపారు.