త్రుటిలో తప్పిన ప్రమాదం!
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:53 AM
పెరవలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): త్రుటి లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా కొట్టగా విద్యార్థులు స్వల్పగాయాల తో బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రు జ్యోతి స్కూలుకు చెందిన బస్సు కానూరు అగ్రహారం ఉసులుమర్రులో విద్యార్థులను ఎక్కించుకుని తీపర్రులో పిల్లలను ఎక్కించుకునేందుకువచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గోదావరి ఏటి గట్టుపై మలుపు తిప్పుకునేందు
ప్రైవేట్ స్కూలు బస్సు బోల్తా
స్వల్ప గాయాలతో క్షేమంగా
బయటపడ్డ 40మంది చిన్నారులు
తీపర్రు వద్ద ఘటన
పెరవలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): త్రుటి లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా కొట్టగా విద్యార్థులు స్వల్పగాయాల తో బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రు జ్యోతి స్కూలుకు చెందిన బస్సు కానూరు అగ్రహారం ఉసులుమర్రులో విద్యార్థులను ఎక్కించుకుని తీపర్రులో పిల్లలను ఎక్కించుకునేందుకువచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గోదావరి ఏటి గట్టుపై మలుపు తిప్పుకునేందుకు వచ్చింది. మ లుపు తిప్పే క్రమంలో గోదావరి వైపు అప్రోచ్ రోడ్డు దాటి రివర్స్‌లో కొద్దిమేర దిగింది. దీంతో బ్రేకులు ఫెయిలై బస్సు ముందుకు రాకుండా వెనకకు కదిలింది. దీంతో డ్రైవర్ కొద్దిమేర స్టీరింగ్‌ను కంట్రోల్ చేసినప్పటికి అప్రోచ్ రోడ్డు సగం పైగా దూరం వెళ్లిన బస్సు అనంతరం పక్కకు తిరగబడింది. సుమారు 40మంది పిల్లలు భయ ంతో కేకలు వేశారు. బస్సు ముందుభాగంలోని అద్దం ఊడిపడడంతో అందులో నుంచి పిల్లలందరూ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆయాగా పనిచేస్తున్న మహి ళకు కూడా గాయాలయ్యా యి. గాయాలైనవారికి స్థానికులు సపర్యలు చేశారు. సంఘటన తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులు, ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చారు. కొంతమందిని తణుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీపర్రుకు చెందిన ప్రత్తిపాటి ప్రసాద్ కుమార్, కుందుల భూపతిరావు, తాడిపర్రు సర్పంచ్ కరు టూరి నరేంద్ర ఘటనా స్థలంలో సహాయ సహకారాలు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని బస్సులను తిప్పుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన చెందారు.
మంత్రి దుర్గేష్ ఆరా
ఈ ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. స్థానిక నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పాఠశాల యాజమాన్యం, అధికారులతో మాట్లాడారు. గాయపడిన చిన్నారులకు తక్షణం వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూలు యాజమాన్యాలను హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా లోపాలను గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.