Share News

పదవి.. మరింత బాధ్యత పెంచింది!

ABN , Publish Date - May 16 , 2025 | 01:11 AM

దళితుల అభివృద్ధి సంక్షేమానికే ప్రభుత్వం ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు చేసిందని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌ అన్నారు.

పదవి.. మరింత బాధ్యత పెంచింది!
పంగిడిలో జవహర్‌కు గజమాల వేసి ఘనంగా స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు, అభిమానులు

కొవ్వూరు, మే 15 (ఆంధ్రజ్యోతి) : దళితుల అభివృద్ధి సంక్షేమానికే ప్రభుత్వం ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు చేసిందని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జవహర్‌కు గురువారం కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు.పంగిడి నుంచి కార్లు, మోటారుసైకిళ్లపై కాపవరం, దొమ్మేరు మీదుగా కొవ్వూరు వరకూ ర్యాలీ చేశారు. మార్గమధ్యలో బాబూ జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవహర్‌ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పదవి తన బరువు, బాధ్యతలు మరింత పెంచిందన్నారు. రాష్ట్రంలో వివక్షతలేని సమసమాజం స్థాపిస్తామన్నారు..గత ప్రభుత్వంలో శివరోముండనం నుంచి ఎమ్మెల్సీలు హత్యలు చేసి జైలుకు వెళ్లిన సంఘటనలు చూశామన్నారు. రాళ్ళ దాడులు, భూఆక్రమణలు, కబ్జాలు చూశామని, వీటన్నింటినీ నియంత్రించడమే నా ముందున్న పెద్ద సవాలన్నారు.కార్యక్రమంలో బూరుగుపల్లి రాఘవులు,వేగి చిన్నా, కోడూరి ప్రసాద్‌, పసలపూడి బోసు, పి.వి.వి.భద్రం, డా.ముళ్ళపూడి రాజేంద్రప్రసాద్‌, పి.కె.రంగారావు, ఆలపాటి సాయికృష్ణ, బిక్కిన ఫణీంద్ర, ఖండబట్టు విజయలక్ష్మి, చిట్టూరి వెంకటేశ్వరరావు, పిక్కినాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 01:11 AM