Share News

గూఢసార్‌లెక్కడ!

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:32 AM

మనలో ఒకడు.. మనతో పాటే ఉంటాడు.. మనలాగే ఉంటాడు..ఆనుపానులు చూసుకుంటాడు.. ప్రమాదాన్ని పసిగడతాడు..

గూఢసార్‌లెక్కడ!

ఢిల్లీ బాంబ్‌ పేలుడుతో ఉలిక్కిపడిన జిల్లా

పోలీసుల తనిఖీలతో భయం..భయం

కొసరు పనుల్లో ఉమ్మడి జిల్లా నిఘా విభాగం

ప్రమాదాలను పసిగట్టలేని వైనం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మనలో ఒకడు.. మనతో పాటే ఉంటాడు.. మనలాగే ఉంటాడు..ఆనుపానులు చూసుకుంటాడు.. ప్రమాదాన్ని పసిగడతాడు.. ఉన్నతాధికారులకు చేరవేస్తాడు.. ప్రమాదం జరగకుండా కాపాడతాడు.. ఇదీ గూఢచారి వ్యవస్థ.. ఉమ్మడి జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ గూఢచారి వ్యవస్థ ఉంటుంది.. గతంలో అయితే వీళ్లు ఎవరనేది ఎవరికీ తెలిసేది కాదు.. ప్రస్తుతం గూఢసార్‌లెవరనేది అందరికీ తెలిసిపోతోంది.. నిఘా లేదు.. ఏం లేదు.. ప్రమాదాన్ని పసిగట్టే పనిలేదు.. బాస్‌లకు సేవ చేసుకుంటూ కొసరు పనులతో దర్జాగా గడిపేస్తున్నారు. ఢిల్లీలో బాంబ్‌ పేలుడు ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది..ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నిఘా వ్యవస్థపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం. సాంకేతికత వినియోగం.. నిఘా.. ఈ రెండు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అత్యంత కీలకమైన భూమిక పోషిస్తాయి. యూనిఫాం వేసుకొని ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా చిక్కని వాటిని నిఘాతో పసిపగట్టి పనిపట్టవచ్చు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటన చూస్తే హృదయం కల చివేస్తోంది. పోలీసులు ముందుగా పసిగట్ట కుండా ఏం చేస్తున్నారనే ప్రశ్న సర్వత్రా వినవ స్తోంది. అయితే యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌, నిఘా వర్గాల సమన్వయంతో పెద్ద ఉపద్రవాన్ని తప్పించాయి. మారణహోమాన్ని మట్టుబెట్టా యి.మరి ఉమ్మడి జిల్లాల్లో నిఘా పటిష్టంగా ఉందా?అనే ప్రశ్నకు మేల్కోవాలనే సమాధానం వినబ డుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

నిఘా విభాగం.. ఏం చేస్తుందంటే..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లో నిఘా విభాగాల పాత్ర కీలకం. పూర్వం వీళ్లను వేగులు,గూఢచారులు అని పిలిచేవారు. పోలీ సుల్లో విజిబుల్‌ పోలీస్‌..యూనిఫాం వేసుకొని తనిఖీలు చేస్తుం టారు.యూనిఫాం లేకుండా ప్రజల్లో కలిసిపోయి తీగ లాగడం, కీలక సమాచారాన్ని ఒడిసిపట్టుకోవడం నిఘా విభాగాల (ఇన్‌వి జిబుల్‌ పోలీసింగ్‌) ప్రధాన విధి. దీని ద్వారా ముందస్తు చర్యలకు మార్గం దొరుకుతుంది. చిన్న నేరాలను నుంచీ భారీ కుట్రలను భగ్నం చేయడం వరకూ వీళ్ల చేతల్లోనే ఉంటుంది. ఢిల్లీ బాంబు పేలుళ్లకు రెండు రోజుల ముందు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసుల నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు సంయు క్తంగా ఆపరేషన్‌ నిర్వహించి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. భారీ కుట్రను భగ్నం చేశారు.ఇది కేవలం నిఘా విభాగాల వల్లనే సాధ్యపడింది.

నిఘా పెరగాలి..

ఉమ్మడి జిల్లాలో ఎన్నో కీలకంగా ఉన్నాయి.. పోలవరం ప్రాజెక్టు, గోదావరిపై వంతెనలు, పలు ఫ్యాక్టరీలు, ప్రధాన నగరాల్లో సాయంత్రం వేళ జనసమ్మర్థత ఎక్కువే. మెయిన్‌రోడ్లు కిటకిటలాడుతూనే ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద ఈనాటికి మెటల్‌ డిటెక్టర్‌ వ్యవస్థ అనేది లేదు. రోజూ సుమారు 40 వేల మంది ప్రయాణించే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు అయితే చాలా దారులున్నాయి. అయినా నిఘా లేదు. కార్తీక మాసం కావడంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అక్కడా ఇంతే.

కొసరు పనులతో సరి

పోలీసు శాఖలో ఉండే నిఘా విభాగం కీలకంగా వ్యవహరించాల్సి ఉన్నా అందుకు భిన్నం గా కొసరు పనులు వారికి ఎక్కువైపోయాయనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ నిఘా(స్పెషల్‌ బ్రాంచ్‌-ఎస్‌బీ) పోలీస్‌ ఒకరు ఉంటారు. జిల్లా స్థాయిలో నిఘా సీఐ, డీఎస్పీకి నేరుగా వీరు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. వాళ్ల ద్వారా జిల్లా పోలీస్‌ బాస్‌ అయిన ఎస్పీకి.. అవసరమైతే అక్కడి నుంచి పైఅధికారులకు సమాచారం వెళుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపు 75 పోలీస్‌ స్టేషన్లలోనూ నిఘా పోలీసులు ఉన్నారు. అయితే అధికశాతం వీళ్లందరూ జేబులు నింపు కోవడానికి పాస్‌పోర్టుల తనిఖీలు, ఇతర వ్యవహారాల్లో తల మునక లైపోయారు. ఎస్పీలకు భజన చేయడం, ఉన్నతాధికారుల సమావేశాలకు ఏర్పాట్లు చేయడం, ఆహార మర్యాదల్లో కొరత రాకుండా చూసుకోవడంలో నిమ గ్నమవుతు న్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, చివరికి ఉన్నతా ధికారి సమావేశంలో కుర్చీ తక్కువైతే వెంటనే రప్పించడం కూడా నిఘా అధికారుల పనిగానే మారిపోయింది.దీంతో అసలు విధులకు సమయం చిక్కడం లేదు. జిల్లాలోని ఎస్పీకి నేరుగా అనుసంధానమై ఉండే ఎస్‌బీ పోలీసులంటే ఆయా పోలీస్‌ స్టేష న్లలోని సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు భయ పడుతూ ఉండే పరిస్థితి ఉంది. మూడు జిల్లా ల్లోని ఒక జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీకి దగ్గరగా ఉండే ఎస్‌బీ అధికారులు సీఐలు, ఎస్‌ ఐలను బెదిరిస్తూ తమ ‘కార్యకలాపాలు’ చక్క బెట్టుకుంటున్నారు.

ఇప్పటికైనా ఓ కన్నేసి

ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యమే కాకుండా ఇప్పటికైనా నిఘా విభాగా లను ఉన్నతాధికారులు పూర్తిగా పరిశీలించి ప్రక్షాళన చేయాల్సిన అవసరత కనిపిస్తోంది. పోలీస్‌ స్టేషన్లు, ఎస్పీల వద్ద భజన యూనిఫాంలకు స్వస్తి చెప్పి అనుభవం,నిబద్ధత ఉన్న వారిని నియమించా ల్సిన అవసరత కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లోని పార్కింగ్‌ ప్రాంతాల్లో నిఘా పోలీసులను నిరంతరాయంగా వినియోగించాలి. నిఘా (ఎస్‌బీ) విభాగం పోలీసుల పనితీరును బేరీజు వేస్తూ కనీసం నెలకో సారి అయినా సమీక్షిస్తూ ఉండాలి.కీలక సమాచార సేకరణ, వాటిని ఉన్నతాధికా రులకు నివేదించడం, ప్రజల్లో మమేకమై సమాచారా న్ని సేకరించడం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటి వాటిపై శిక్షణ ఇప్పించాలి. కొసరు పనులను పక్కన పెట్టించాల్సిన అవసరత కనిపిస్తోంది.

Updated Date - Nov 12 , 2025 | 12:32 AM