సత్యసాయి సందేశాలు సమాజాన్ని నడిపించే వెలుగులు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:38 AM
రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): సత్యసాయి ప్రేమ, సేవ, దయపై ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ సమాజాన్ని నడి పించే వెలుగులని జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ అన్నారు. సత్యసాయిబాబా శతజయంతి జిల్లాస్థాయి వేడుకలను ఆది వారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జ్యో
జేసీ మేఘ స్వరూప్
ఘనంగా శత జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): సత్యసాయి ప్రేమ, సేవ, దయపై ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ సమాజాన్ని నడి పించే వెలుగులని జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ అన్నారు. సత్యసాయిబాబా శతజయంతి జిల్లాస్థాయి వేడుకలను ఆది వారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రకాశనం, వేదపారాయణం, భజనలు, కీర్తనలు, నృత్య ప్రదర్శనలతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం జేసీ మాట్లాడు తూ సేవే పరమధర్మం అనే సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించి చూపిన ఆయన జీవి తం స్ఫూర్తిదాయకమన్నారు. ఆరోగ్యం, విద్య, శుద్ధజల ప్రాజెక్టులు, పేదల సంక్షేమం, విప త్తుల సమయంలో ఆందించిన సహాయం వంటి ఎన్నో సేవలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. యువత తమ శక్తి, ప్రతిభ, సమయాన్ని సమాజ సేవలో వినియోగిస్తే దేశ అభ్యున్నతి మరింత వేగవంతమవుతుం దని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మా ట్లాడుతూ భారతీయత సారాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు సత్యసాయి బాబా అని అన్నారు. 140 దేశాల్లో ఆయన సేవలు నడుస్తుండడం విశ్వసేవకు నిదర్శన మన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్యచౌదరి మాట్లాడుతూ పుట్టపర్తి వంటి వెనకబడిన ప్రాంతాన్ని ప్రపంచపటంలో ధీటుగా నిలబెట్టిన సాయి సేవలు మరువ రానివన్నారు. గురుకుల విద్య తన జీవితానికి మార్గదర్శకమైందన్నారు. శతజయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించడం ఆనంద దాయకమన్నారు. రుడా చైర్మన్ వెంకట రమ ణచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వాలకంటే ముందుగానే తాగునీరు, విద్య, వైద్యం వంటి సంక్షేమ పథకాలను అమలుచేసి లక్షలాది కుటుంబాల్లో సాయిబాబా వెలుగులు నింపా రన్నారు. ప్రేమ, సేవ అనే రెండు విలువల ను జీవితాంతం ఆచరించి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు సత్యసాయి అని, ఉచిత విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలను సాయి సెంట్రల్ ట్రస్టు అందిస్తోందని సత్య సాయి గురుకులం కరస్పాండెంట్ ఎ.శ్యామ్ సుందర్ తెలిపారు. అన్ని మాతాల సారం ఒకటేననేదే బాబా బోధనల సారాంశమని ప్రిన్సిపాల్ కె.గుర్రయ్య చెప్పారు. కార్యక్ర మంలో అడి షనల్ ఎస్పీ సుబ్బరాజు, ఇంచార్జి డీ ఆర్వో భాస్క రరెడ్డి, సీపీ వో ఎల్. అప్పలకొండ పాల్గొన్నారు.