Share News

సత్యసాయిబాబా శత జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:30 AM

పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టా త్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

సత్యసాయిబాబా శత జయంతి  రాష్ట్ర పండుగగా నిర్వహించాలి : కలెక్టర్‌

రాజమహేంద్రవరం రూరల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టా త్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఈమేరకు రెవెన్యూ, సత్యసాయి గు రుకుల పాఠశాల, విద్యాశాఖ, సంగీత కళాశాల సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలను జిల్లా, డివిజన్‌, నియోజ కవర్గం, మునిసిపాలిటీ, మండల, సచివాలయ స్థాయిలో అధికారికంగా శత జయంతి కార్యక్ర మం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నవంబరు 19 నుంచి 24 వరకు అత్యున్నత స్థాయిలో నిర్వ హిస్తోందన్నారు. ముఖ్యంగా 23న బాబా జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అన్ని కేంద్రాలలో తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. వీటి ఫొటోలను అప్‌లోడ్‌ చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఆర్వో భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో రాణిసుస్మిత, గురుకులం కరస్పాండెంట్‌ శ్యాంసుందర్‌, డీపీఆర్‌వో ఎం. లక్ష్మణాచార్యులు, డీటీ శాస్త్రి పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 01:30 AM