Share News

మీకు ఆరోగ్యం ఇస్తున్నాం.. మా సంగతో!

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:31 AM

చెత్తను చూస్తే దగ్గరికే వెళ్లరు..ముక్కున ఖర్చీఫ్‌ పెట్టు కుని దూరంగా వెళ్లిపోతారు..ఎందుకంటే ఏ రోగం తమకు అంటుకుటుందోనని భయం.. అటువంటిది ఆ చెత్తను తరలించి.. వీధులను శుభ్రంగా ఉంచే వాహనడ్రైవర్లకు మాత్రం ఆరో గ్య భద్రత కరువైంది.

మీకు ఆరోగ్యం ఇస్తున్నాం.. మా సంగతో!
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కార్యాలయం

ఈఎస్‌ఐ అమలు కాక ఇక్కట్లు

ఆరోగ్యశ్రీకి దూరందూరం

పీఎఫ్‌కు కట్‌..కట

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వెతలు

కొవ్వూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : చెత్తను చూస్తే దగ్గరికే వెళ్లరు..ముక్కున ఖర్చీఫ్‌ పెట్టు కుని దూరంగా వెళ్లిపోతారు..ఎందుకంటే ఏ రోగం తమకు అంటుకుటుందోనని భయం.. అటువంటిది ఆ చెత్తను తరలించి.. వీధులను శుభ్రంగా ఉంచే వాహనడ్రైవర్లకు మాత్రం ఆరో గ్య భద్రత కరువైంది. దీంతో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునేవారే కరవవుతు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 10 వేల మంది డ్రైవర్లు అవుట్‌ సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 42 మంది ఉన్నారు. వీరందరికి 2024 జనవరిలో వైసీపీ ప్రభుత్వం రూ.24,500 చొప్పున వేతనాలు పెంచింది. అయితే ఈఎస్‌ఐ పరిధి రూ.21 వేలు కావడంతో ఆగిపోయింది. ఈఎస్‌ఐ లేకపోవడం, ప్రభుత్వం హెల్త్‌ అలవెన్స్‌లు చెల్లించడంలేదు.. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ అమలు కావడంలేదు.దీంతో డ్రైవర్లు, వారి కుటుం బా లు ఆరోగ్య భద్రతపై ఆందోళన చెందుతున్నా రు.ఏదైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆసు పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని వా పోతున్నారు.మరో పక్క పీఎఫ్‌ పాత వేతనం రూ.15 వేలకు మాత్రమే 12 శాతం చొప్పున రూ.1800లు, ప్రొఫెషనల్‌ టాక్స్‌ రూ.200లు కలిపి రికవరీ చేస్తూ ఒక్కొక్క ఉద్యోగి నుంచి రూ.2వేలు చొప్పున కట్‌ చేస్తున్నారు. రూ.24,500ల పూర్తి వేతనంపై పీఎఫ్‌ రికవరి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యో గులుగా పరిగణించడంతో కనీస వేతనాలు అమలు కాకపోగా ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు అందడం లేదు. పెరుగుతున్న ధరలతో కుటుంబపోషణ కష్టసాధ్యంగా మారిందని కన్నీ టి పర్యంతమవుతున్నారు.కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పఽథకాలను వర్తింపచేయాలని కోరుతున్నారు. గత 18 నెలలుగా యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరినా ఫలితం లేదని వా పోతున్నారు.కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయాలని ఎమ్మెల్యేలను వేడుకుంటున్నారు.

ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి

మునిసిపాలిటీల్లో అవుట్‌సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తు న్న డ్రైవర్లకు పూర్తిస్థాయిలో పీఎఫ్‌,ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ అలవెన్సు రూ.6 వేలు అందించాలి. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరికి ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి.

- రాజాన అప్పారావు, సంఘ కొవ్వూరు మునిసిపల్‌ జేఏసీ అధ్యక్షుడు

Updated Date - Jun 09 , 2025 | 12:32 AM