28 ఇసుక ర్యాంపులు నిలిపివేత
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:15 AM
జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిచి పోయాయి.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిచి పోయాయి. జిల్లాలో 15 ఓపెన్ రీచ్‌లు, 10 సెమీ మెకనైజ్డ్ రీచ్‌లు, 3 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు ఆగినట్టు జిల్లా మైన్స్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి సోమవారం ప్రకటించారు. జూన్ 1 నుం చే అమల్లోకి రాగా అక్టోబరు 15వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని తెలిపారు. 18 డీసిల్టేషన్ పాయింట్లలో మాత్రం ఇసుక తవ్వకాలు జరుగుతాయి. జిల్లాలో 29 స్టాక్ పాయింట్లలో అధికారులు నిర్ణ యించిన ధర ప్రకారం ఇసుక విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్(కలెక్టర్) నిర్ణయిం చిన ధరల మేరకు స్టాక్ పాయింట్ల వద్ద కాంట్రాక్టు ఏజెన్సీలు ఇసుక విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టారు. జిల్లాలో ఆగిపోయిన ర్యాంపుల వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వూరు మండలం అరికి రేవుల, చిడిపి, తాళ్లపూడి మండలం ప్రక్కిలంక , నిడదవోలు మండలం పురు షోత్తపల్లి సెమీ మెకనైజ్డ్ రీచ్‌లను నిలి పివేశారు.సీతానగరం మండలం ముల కల్లంక, మునికూడలి-1,2 పట్టాభూములు నిలిపివేశారు. మాన్యువల్‌రీచ్‌లు కొవ్వూ రులోని చిడిపి, కుమారదేవంలో మూడు ర్యాంపులు,నిడదవోలులోని జీడిగుంట, పందలపర్రు,పెండ్యాల, పెరవలి మండ లం కాకరపర్రు,తీపర్రు -2,3 సీతా నగరం మండలం ములకల్లంక- కాట వరం,వంగలపూడి1,2, తాళ్లపూడిలోని వేగేశ్వరపురం, కడియంలోని వేమగిరి- కడియపులంక రీచ్‌లను అధికారులు నిలిపివేయాలని ఆదేశించారు. వర్షాకా లమైనప్పటికీ 18 డీసిల్టేషన్ ర్యాంపులలో ఇసుక తీతకు అనుమతిచ్చారు. కొవ్వూరు మండలం అరికిరేవుల-1,2, ఔరంగాబాద్ -1,2,దొండగుంట-1,2,కొవ్వూరు,ఎరినమ్మ, వాడపల్లి-1,2,రాజమండ్రి రూరల్ పరిధి ధవళేశ్వరంలో రెండురీచ్‌లు, కాతేరు, రాజమండ్రి సిటీ పరిధి కోటిలింగాల రీచ్,తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, ప్రక్కిలంక-1, తాడిపూడి -1, మరొ కటి, తాళ్లపూడి-1 రీచ్‌లలో డీసిల్టేషన్ జరుగు తుంది.వర్షాకాలంలో ఇసుక కొరత లేకుం డా 29 స్టాక్ పాయింట్లలో నిల్వలు చేస్తున్నారు.అక్కడే ఇసుక విక్ర యిస్తారు.