లోగుట్టు!
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:47 AM
ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు ఉండడంలేదు.. చివరికి స్టాక్ పాయింట్లనూ వదలడంలేదు.. అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇసుక అక్రమాలకు పాల్పడే స్థాయికి దందా ఎదిగింది..
ఇతర జిల్లాల పేరుతో స్టాక్
ఇప్పుడు ఇక్కడే విక్రయాలు
ఇతర జిల్లాల్లో పాయింట్లు ఖాళీ
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు ఉండడంలేదు.. చివరికి స్టాక్ పాయింట్లనూ వదలడంలేదు.. అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇసుక అక్రమాలకు పాల్పడే స్థాయికి దందా ఎదిగింది.. అయినా చూస్తూ వదిలేయడం తప్ప అధికారులేం చేయలేకపోతున్నారు.. ఇతర జిల్లాల పేరు చెప్పి ఇక్కడ లూటీ చేస్తున్నా అదే పరిస్థితి మరి.. ఇసుక గుట్టలో లోగుట్టును అధికారులు కని పెట్టలేకపోతున్నారు. అక్రమార్కులకు సహకరి స్తున్నారు.ఇసుక ఆదాయం రుచిమరిగిన వ్యా పారులు మరింతగా దోచుకోవడానికి రకరకాల ఎత్తు గడలు వేస్తున్నారు.నిబంధలకు విరుద్ధంగా కొందరు డ్రెడ్జింగ్ చేయడం, చాటుమాటుగా విక్రయించడం, ఓవర్ లోడ్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. స్టాక్ పాయిం ట్లలో పెట్టిన నిల్వల్లో కూడా అక్రమాలు చేయ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి స్టాక్ పాయింట్లలో ఒక రకమైన ప్రయ త్నం జరుగుతుండగా.. వేరే జిల్లాలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లలో అక్రమాలకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా లో గోదావరి ఇసుక ర్యాంపుల నుంచి ఇతర జిల్లాల్లోని స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయ డానికి కాకినాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు.ఈ పాయింట్లు పొందడానికి పెద్ద ఎత్తున రాజకీయ ప్రభావం చూపించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతి నిధులతో సిఫారసు చేయించుకుని స్టాక్ పాయింట్లు పెట్టుకోవడానికి సుమారు 3 నెలల క్రితమే అనుమతులు పొందారు. కానీ ఒక స్టాక్ పాయింట్‌లో కూడా ఇసుక పెట్టలేదు. కొన్ని చోట్ల కేవలం వెయ్యి,2 వేల టన్నులు మాత్రమే పెట్టారు.వాటి పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో స్టాక్ పాయింట్లు పెట్టుకున్నారు.వాస్తవానికి ఈ ఇసుకను ఆయా ప్రాంతాల్లో స్టాక్ పాయింట్ల లోనే పెట్టుకోవాలి.వర్షాల వల్ల ఇబ్బందులు ఉం టాయని జిల్లాలో ముందుగా స్టాక్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతి పొందారు. ప్రస్తుతం ఆయా స్టాక్ పాయింట్లలో ఇసుకను మళ్లీ ఆయా జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్దకు తర లించి విక్రయించాలి. అయితే అక్కడికి తీసుకెళ్లకుండా నేరుగా తూ ర్పుగోదావరి జిల్లా నుంచి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏ జిల్లాకు ఎక్కడెంత..!
కాకినాడ జిల్లా కోసం కాటవరంలో 88054 మెట్రిక్ టన్నులు, విశాఖ కోసం కుమార దేవంలో 1,17,270 టన్నులు, పశ్చిమగోదావరి జిల్లా కోసం పెండ్యాలలో 44,720 టన్నులు, పెండ్యాలలో మరో చోట 13,810 టన్నులు నిల్వ చేశారు. అనకాపల్లి జిల్లా కోసం సింగ వరంలో 71,001 టన్నులు, సింగవరంలో మరో చోట 20,516 టన్నులు నిల్వ చేశారు. ఏలూరు జిల్లా కోసం తాడిపూడిలో ఒక చోట 23,907 టన్నులు, మరో చోట 13,116 టన్నులు నిల్వ చేశారు.మొత్తం ఆయా జిల్లాల కోసం 13,79, 841 టన్నుల ఇసుక నిల్వ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా జిల్లాల్లో స్టాక్ పాయింట్లకు ఇసుక చేర్చకుండా నేరుగా విక్ర యించాలనే యోచన చేస్తుండడంతో ఇప్ప టికే కొంత విక్రయించినట్టు సమాచారం.
29 స్టాక్ పాయింట్లు రెడీ
ముందస్తుగా స్టాక్ పాయింట్లు
వరద తాకిడితో ప్రారంభం
9.87 లక్షల టన్నుల ఇసుక నిల్వ
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
గోదావరికి వరద పోటెత్తడంతో స్టాక్ పాయి ంట్ల నుంచి ఇసుక సరఫరా ప్రారంభించారు. ఆయా స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక ధర కూడా నిర్ణయించారు.జిల్లాలో మొత్తం 29 స్టాక్ పాయింట్లు ఉన్నాయి.ఇసుక స్టాక్ పాయింట్లను మాన్‌సూన్ స్టాక్ పాయింట్లు (ఎస్‌పీఎం) అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ 9,87, 408 టన్నుల ఇసుక నిల్వ చేయగా ఇప్పటికే 1370 టన్నుల ఇసుక సరఫరా చేశా రు. ఇంకా ఈ ఎస్‌పీఎంలలో 9 లక్షల 86 వేల 38 టన్ను ల ఇసుక నిల్వలున్నాయి.స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక ధర,దానిని స్టాక్ పాయింట్‌కు తె చ్చిన ర్యాంపు స్వభావాన్ని బట్టి నిర్ణయించారు. ఇసుక సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ధరలు ఇలా..
జిల్లాలో 18 డీసిల్టేషన్ పాయింట్లు , 9 సెమీ మెకనైజ్డ్ ర్యాంపులు, 3 పట్టాభూములు ర్యాం పులు, 15 మ్యాన్యువల్ ర్యాంపులు ఉన్నాయి. మాన్‌సూన్ సీజన్ వల్ల కేవలం డీసిల్టేషన్ ర్యాంపులకు మాత్రమే ఇసుక తీతకు అను మతిచ్చారు. మిగతా మూడు రకాల ర్యాం పులకు అక్టోబరు 15 వరకూ అనుమతి లేదు. ప్రస్తుతం గోదావరికి వరద పెరుగుతుండడం వల్ల డీసిల్టేషన్ ర్యాంపులకు కొంత ఇబ్బంది ఏర్పడింది.మూడు రోజుల నుంచి ఇసుక తీత తగ్గింది. సెమీ మెకనైజ్డ్ బోట్ల ద్వారా తీసిన ఇసుక టన్ను రూ.160కి ఇస్తారు.పట్టా భూ ముల నుంచి తెచ్చిన ఇసుక టన్ను రూ. 214, మాన్యువల్‌గా తీసిన ఇసుక ధర రూ. 145, డీసిల్టేషన్ ఇసుక టన్ను ధర రూ.297గా నిర్ణయించారు.గత వైసీపీ ప్రభుత్వంలో స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక రూ.850 నుంచి రూ.950 వరకూ విక్రయించిన సంగతి తెలి సిందే.టీడీపీ కూటమి ప్రభుత్వంలో ధరలు అందు బాటులో ఉన్నాయి.
ఏ స్టాక్ పాయింట్ ఎక్కడ..
ఫ మాన్యువల్‌గా ఇసుక తీసిన పాయింట్లలో టన్ను ధర రూ.145.చిడిపి, జీడిగుంట, కాకర పర్రు,కాటవరం, కుమారదేవం-1, 2, ముని పల్లి, తీపర్రు,వంగలపూడి- 2, వంగలపూడి -1, వేగే శ్వరపురంలో మాన్యువల్ ధర ఉంది.
ఫ సెమీమెకనైజ్డ్ ర్యాంపుల ద్వారా తీసిన ఇసుకకు సంబంధించిన స్టాక్ పాయింట్లలో టన్ను ధర రూ.160గా ప్రభుత్వం నిర్ణ యించింది.అరికరేవుల,చిడిపి,ప్రక్కిలంక, పురుషోత్తపల్లి, వడిశలేరు..ఆయా స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక ఉంది.
ఫ పట్టాభూములకు సంబంధించిన ర్యాంపుల నుంచి తెచ్చి స్టాక్ చేసిన ఇసుక సరఫరాకు టన్నుకు రూ.214గా నిర్ణయించారు.ఈ ముల కల్లంక, మునికూడలి 1,2 ఉన్నాయి.
ఫ డీసిల్టేషన్ పాయింట్ల నుంచి తెచ్చి స్టాక్ చేసిన ఇసుక టన్ను ధర రూ. 297గా నిర్ణయిం చారు.దొండగుంట-1, ధవళేశ్వరం, ఎరినమ్మ-1, కాతేరు,కోటిలింగాల-2, ప్రక్కిలంక -1, ప్రక్కి లంక-3, తాడిపూడి-1, తాడిపూడి-2, తాళ్లపూడి-2 స్టాక్ పాయింట్లలో ఇదే ధరకు సరఫరా చేస్తారు.ఈ పాయిం ట్లలో కూడా ఇష్టానుసారం సరఫరా చేయడానికి లేదు.