అన్నవరం దేవస్థానంలో సంప్రోక్షణ ప్రారంభం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:25 AM
అన్నవరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి వివి ధ అంశాలపై ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న నేపథ్యంలో నివారణా చర్యల్లో భాగంగా లోక కల్యాణార్థం దేవస్థానం వైదికకమిటీ సూచనల మేరకు సంప్రోక్షణ కార్యక్రమా లు చేపట్టాలని నిర్ణయంచడంతో సోమవారం ఉదయం నుంచి దర్బారు మండపంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8.56 నిమిషాలకు గణపతిపూజ, పుణ్యాహవచనం
వరుస వివాదాల నేపథ్యంలో నిర్వహణ
మూడురోజుల పాటు కార్యక్రమాలు
అన్నవరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి వివి ధ అంశాలపై ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న నేపథ్యంలో నివారణా చర్యల్లో భాగంగా లోక కల్యాణార్థం దేవస్థానం వైదికకమిటీ సూచనల మేరకు సంప్రోక్షణ కార్యక్రమా లు చేపట్టాలని నిర్ణయంచడంతో సోమవారం ఉదయం నుంచి దర్బారు మండపంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8.56 నిమిషాలకు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచనవ్యప్రాశన, రుత్విక్‌వరుణలు, మంటపారాధనలు నిర్వహించారు. కల్యాణబ్రహ్మ చామర్తి వెంకటిరెడ్డి, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పాల ంకి చినపట్టాభి, విజెడి శర్మ నిర్వహించారు. ఈ నెల 15న ఉదయం 11గంటలకు పూర్ణాహుతితో ముగుస్తాయి. శ్రీమత్రిపాద్వి భూతి మహావైకుం ఠ నారాయణోపనిషత్ పారాయణలు, హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవస్థానం పండితులు పేర్కొన్నారు. ప్రధానాలయాల్లో ఏటా ఏదొక యజ్ఞయాగాధులు జరుగుతుంటుండగా అన్నవరం దేవస్థానంలో సైతం నిర్వహించేవా రు. అయితే గత రెండేళ్లుగా ఏ యజ్ఞయాగాధి క్ర తువులు నిర్వహించలేకపోయారు. తిరుమలలో సైతం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. వరుస వివాదాల నేపథ్యంలో పండితుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.