Share News

పగలు వైద్యం..రాత్రికి తాళం!

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:45 AM

అది సాక్షాత్తూ మంత్రి దుర్గేష్‌ ఇలాఖా..అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..సేవలు సక్రమంగా అందించాలి..

పగలు వైద్యం..రాత్రికి తాళం!
సోమవారం రాత్రి మూసివేసిన ఆసుపత్రి

24 గంటలు వైద్య సేవలు నిల్‌

అందుబాటులో ఉండని సిబ్బంది

అత్యవసరమైనా అంతే

వేరే ప్రాంతాల నుంచి విధులకు

ఆరు గ్రామాల ప్రజల ఇక్కట్లు

సమిశ్రగూడెం పీహెచ్‌సీ దుస్థితి

నిడదవోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : అది సాక్షాత్తూ మంత్రి దుర్గేష్‌ ఇలాఖా..అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..సేవలు సక్రమంగా అందించాలి.. లేదంటే పనిష్మెంట్‌ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది..ఎందుకంటే మంత్రి కదా.. అయినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం విధుల్లో అలసత్వం వీడ డంలేదు..ఇది ఎక్కడో అయితే పరవా లేదు..ఎందుకంటే ఒక రోజు కాకపోతే మరో రోజు చేసుకోవచ్చు.సాక్షాత్తు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి ఉంటే కష్టమే కదా మరి..నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు వైద్య సేవలందిం చాలి.అయితే పగలు మాత్రమే సేవలందిస్తూ రాత్రి సెలవు తీసుకుంటుంది.అయినా పట్టించుకునేవారులేరు..కన్నెత్తి చూసేవారే లేరు.

అత్యవసరమైతే అంతే..

నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో 2016 సంవత్సరంలో పది పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. సుమారు ఆరు గ్రామాల ప్రజలకు వైద్య సేవలందించాలి.ఈ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యాధికారులు ఒక ఎంపీహెచ్‌ఈవో, ఒక ఫార్మాసిస్ట్‌, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక పీహెచ్‌ఎన్‌, ఎంపీహెచ్‌ఎస్‌ ఫిమేల్‌ ఒకరు తదితర సిబ్బంది ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటుగా అత్యవసర వైద్య సేవలు చూడాలి. దీంతో పాటుగా రాత్రి సమయంలో ఎటువంటి అత్యవసర కేసు వచ్చినా డాక్టర్స్‌ వచ్చి చూడాలి. అయితే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పగలు సేవలందుతున్నా సాయంత్రం అయితే చాలు తాళాలు వేసి వెళ్లిపోతున్నట్టుగా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతి సోమవారం రాత్రి 7.30 గంటలకు ఆసుపత్రిని విజిట్‌ చేయగా అప్పటికే తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. రాత్రి సమయంలో డ్యూటీలో ఉండాల్సి సిబ్బంది లేరు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మెడికల్‌ ఆఫీసర్‌ 1 స్థానికంగా నివాసం ఉండడం లేదని సమాచారం. రాజమహేంద్రవరం నుంచి పగలు వచ్చి వెళుతుంటారని సమాచారం. దీనిపై మంగళవారం మెడికల్‌ ఆఫీసర్‌ 2 డాక్టర్‌ శ్రీనిధిని వివరణ కోరగా రాత్రి సమయాల్లో స్టాఫ్‌ నర్స్‌ను డ్యూటీలో ఉంచుతున్నామని ఏ సమయంలో అత్యవసర కేసులు వచ్చిన ఆమె ఇచ్చిన సమాచారంతో అటెండ్‌ అవుతున్నామని తెలిపారు. మంత్రి దుర్గేష్‌, జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాఽథమిక ఆరోగ్య కేం ద్రంపై దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Jul 30 , 2025 | 12:45 AM