Share News

సామర్లకోట చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా

ABN , Publish Date - May 16 , 2025 | 12:46 AM

సామర్లకోట, మే 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ (వైసీపీ)పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేకాధికారి మల్లిబాబు సమక్షం లో గురువారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో ఏకాకి అయిన చైర్‌పర్సన్‌ అరుణ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా లేఖను సమావేశానికి గంట ముందుగా కమిషనర్‌ శ్రీవిద్యకు అందజేశారు. అప్పటికే ప్రత్యేక

సామర్లకోట చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా
రాజీనామా లేఖను సామర్లకోట మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేస్తున్న చైర్‌పర్సన్‌

కోర్టును ఆశ్రయించినా సమావేశాన్ని అడ్డుకోలేకపోయిన అరుణ

అవిశ్వాస తీర్మాన సమావేశానికి

25 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు

సామర్లకోట, మే 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ (వైసీపీ)పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేకాధికారి మల్లిబాబు సమక్షం లో గురువారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో ఏకాకి అయిన చైర్‌పర్సన్‌ అరుణ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా లేఖను సమావేశానికి గంట ముందుగా కమిషనర్‌ శ్రీవిద్యకు అందజేశారు. అప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసిం ది. ఇక తనకు ఓటమి తప్పదని భావించిన చైర్‌ పర్సన్‌ అరుణ రాజీనామా లేఖను అందజేశారు. ఇప్పటికే సమావేశం నిర్వహించకుండా అడ్డుకు నేందుకు చైర్‌పర్సన్‌ కోర్టులను సైతం ఆశ్రయిం చినప్పటికీ సమావేశం నిర్వహించేందుకు ఎటు వంటి అడ్డంకులు లేకపోవడంతో గురువారం ముందుగా ఊహించిన రీతిలోనే సమావేశం ని ర్వహించారు. అందరూ ఊహించినట్లు అవిశ్వా సానికి అనుకూలంగా 25 మంది కౌన్సిలర్లు చే తులెత్తి మద్దతు తెలిపారు. సమావేశానికి ప్రిసై డింగ్‌ అధికారిగా వ్యవహరించిన మల్లిబాబు కౌన్సిలర్లను లెక్కించారు. తదనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చైర్‌పర్సన్‌ కోర్టును ఆశ్రయిం చడంతో ఫలితాన్ని వెల్లడించడంలేదని చెప్పారు.

అందుకే అవిశ్వాసం ప్రకటించాం

మూడు నెలలు మాత్రమే చైరపర్సన్‌ పదవి లో కొనసాగేందుకు ముందుగా పార్టీ నాయ కులు నిర్ధేశించినప్పటికీ ఊహించని రీతిలో నా లుగేళ్ల పాటు పదవిలో కొనసాగిన చైర్‌పర్సన్‌ అరుణ సొంత పార్టీ కౌన్సిలర్లనే ఏమాత్రం లెక్కి ంచకుండా ఏకపక్షధోరణి అవలంభించడం వల్లే కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకించామని వైస్‌ చైర్మ న్లు జాన్‌మోజెస్‌, గోకిన సునేత్రాదేవి, ఆవాల లక్ష్మీనారాయణ, పాగా సురేష్‌కుమార్‌, రెడ్నం సునీత, నేతల హరిబాబు పేర్కొన్నారు. కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం అనంతరం విలేకర్లతో వారు మాట్లాడుతూ పార్టీని, నాయకులను కించపరిచే రీతిలో చైర్‌పర్సన్‌ మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. పార్టీ పలు దఫాలు చేసిన సూచనలు పెడత్రోవ పెట్టారన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన చైర్‌పర్సన్‌ అరుణ ను ఇప్పటికే పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తదుపరి జరిగే కార్యక్రమాలకు పార్టీ అధిష్టానం సూచ నల మేరకే తామంతా కలిసి పనిచేస్తామని, పట్టణాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పథంలోక పయనింపజేస్తామని వారు చెప్పారు.

Updated Date - May 16 , 2025 | 12:46 AM