Share News

రైల్వే పట్టాలపైకి వరదనీరు... రైల్వే అధికారుల సమీక్ష

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:46 AM

సామర్లకోట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట రైలు పట్టాలపైకి ఆదివారం పెద్దఎత్తున వరదనీరు చేరిక, పలు రైళ్ల రాక పోకలకు సుమారు 16 గంటల పాటు అంతరా యం వంటి సంఘటనలను రైల్వే ఉన్నతాధికా రులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయం పై సోమవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై రైల్వే ఉన్నతాధికారులు సమీక్షించారు. క్షేత్రస్థాయి లో పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించ డం

రైల్వే పట్టాలపైకి వరదనీరు... రైల్వే అధికారుల సమీక్ష
సామర్లకోట ఎఫ్‌సీఐ గోదాముల వద్ద పుంత రహదారిని పరిశీలిస్తున్న అధికారులు

పుంత రహదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల కారణంగానే ముంపు అని గుర్తింపు

సామర్లకోట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సామర్లకోట రైలు పట్టాలపైకి ఆదివారం పెద్దఎత్తున వరదనీరు చేరిక, పలు రైళ్ల రాక పోకలకు సుమారు 16 గంటల పాటు అంతరా యం వంటి సంఘటనలను రైల్వే ఉన్నతాధికా రులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయం పై సోమవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై రైల్వే ఉన్నతాధికారులు సమీక్షించారు. క్షేత్రస్థాయి లో పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించ డంతో రైల్వే ఏఈఎన్‌ ప్రభాకర్‌, అధికారులు, సిబ్బంది మంగళవారం సత్యనారాయణపురం శివారు వీర్రాజునగర్‌, ఎఫ్‌సీఐ గోదాములు, మట్ట లవారి చెరువు, ఏడీబీ రోడ్డు వంటి ప్రాంతాలను పరిశీలించి పట్టణ ఎగువ ప్రాంతాల్లో గరువులలో కురిసిన వర్షం నీరు రాకకు పూర్వం నుంచీ ఉన్న పుంతమార్గాలు, చెరువులకు ఉన్న స్లూయిజ్‌ల మార్గాలను, రైల్వే కాలువల నుంచి మున్సిపల్‌ డ్రైన్‌లోకి సత్యనారాయణపురం ఫ్లయ్‌ఓవర్‌బ్రిడ్జి పక్కనుంచి ఉన్న ప్రధాన డ్రైనులను పరిశీలించా రు. పుంత రహదారులు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు. అలాగే ఏడీబీ రోడ్డు మీ దుగా రాక్‌ సిరామిక్‌ సమీపం నుంచి ఎఫ్‌సీఐ గోదాములు పక్క నుంచి రైల్వే తూముల మీదు గా పూర్వం నుంచి ఉన్న పుంత రహదారిని పూర్తిగా ఆక్రమించడం వల్ల ఎగువ ప్రాంతాల్లో వరదనీరు ఆ తూములమీదుగా కాకుండా రైలు పట్టాలపైకి చేరుతున్నందునే ముంపు సమస్య ఎదుర్కొంటున్నట్టు ప్రాఽథమికంగా గుర్తించి నివేదికలు రూపొందించారు. సత్యనారాయణ పురం శివారున రైల్వే గోతులు ఆక్రమణలకు గురై పెద్దపెద్ద భవనాలు నిర్మించినట్టు క్షేత్ర స్థాయిలో గుర్తించారు. ఆక్రమణలను గుర్తించేం దుకు శాశ్వత ప్రాతిపదికన, భవిష్యత్తులో రైలు పట్టాల పైకి వరదనీరు చేరకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టేందుకు రైల్వే, మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని స్థానిక అధి కారుల బృందం నిర్ణయించి రైల్వే ఉన్నతాధి కారుల అనుమతుల కోసం నివేదికలు పంపారు.

Updated Date - Oct 22 , 2025 | 12:46 AM