Share News

‘ఉప్పు’డేమంటారో!

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:02 AM

జిల్లాలో 1,245 ఎకరాల ఉప్పు భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం వీటిని సాల్ట్‌ కమి షననుంచి తీసుకునే ప్రక్రియలో వేగం పెంచిం ది. ఈమేరకు అనేక తర్జన భర్జనలు, రిజిసే్ట్రషన్ల శాఖతో పలు మదింపుల తర్వాత ఎట్టకేలకు వీటికి ధర నిర్ణయించింది.

‘ఉప్పు’డేమంటారో!
కరప మండలంలో సాల్ట్‌ భూములు

  • జిల్లాలో 1,245 ఎకరాల సాల్ట్‌ భూముల అప్పగింతపై ఏమంటారో

  • వీటి ధర తెలపాలని కోరిన చెన్నై డిప్యూటీ సాల్ట్‌ కమిషనర్‌

  • తాజాగా ఎకరాకు రూ.6.50లక్షలు నిర్ణయించిన అధికారుల కమిటీ

  • రూ.80.92కోట్లు చెల్లించేలా ప్రతిపాదనల నివేదిక పంపిన వైనం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో 1,245 ఎకరాల ఉప్పు భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం వీటిని సాల్ట్‌ కమి షననుంచి తీసుకునే ప్రక్రియలో వేగం పెంచిం ది. ఈమేరకు అనేక తర్జన భర్జనలు, రిజిసే్ట్రషన్ల శాఖతో పలు మదింపుల తర్వాత ఎట్టకేలకు వీటికి ధర నిర్ణయించింది. ఎకరాకు రూ.6.50లక్ష ల చొప్పున జిల్లాఅధికారుల కమిటీ రేటు ఖరా రు చేసింది. ఈమేరకు మొత్తం 1,245 ఎకరాల కు రూ.80.92కోట్లు చెల్లించడానికి అంగీకరించిం ది. ఈ మేరకు చెన్నైలోని డిప్యూటీ సాల్ట్‌ కమిష నర్‌కు చెల్లింపు ప్రతిపాదనల నివేదిక పంపిం చింది.ఈ ధరకు తమ భూములను రాష్ట్ర ప్రభు త్వ మారిటైం బోర్డుకు బదిలీ చేయడానికి సాల్ట్‌ కమిషన అంగీకరిస్తుందా? లేదా? అనేది తేలా ల్సి ఉంది. కొన్ని నెలల కిందట కాకినాడ, కరప, తాళ్లరేవు మండలాల పరిధిలోని తమ భూము లను స్వయంగా వచ్చి సాల్ట్‌ కమిషన పరిశీలిం చింది. బహిరంగ మార్కెట్‌లో ధరపై ఆరా తీసి వెళ్లింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల కమి టీ నిర్ణయించిన ధరపై ఏం నిర్ణయం తీసుకుం టుందనేది సస్పెన్సగా మారింది.

పారిశ్రామిక అవసరాలకు..

జిల్లాలో కాకినాడ నగరం పరిధిలోని జగన్నా థపురంలో 117.65 ఎకరాలు, రూరల్‌ పరిధిలో గురజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరా లు, పెనుగుదురులో 501.26ఎకరాల ఉప్పు భూ ములున్నాయి. ఇవన్నీ చెన్నైలోని డిప్యూటీ సాల్ట్‌ కమిషనకు చెందినవి. వీటిపై పూర్తి హక్కులు కమిషనవే. వీటిని సాల్ట్‌ కమిషన ఎన్నోఏళ్లుగా ఎందుకూ వినియోగించకుండా ఖాళీగా వదిలే సింది. ఈనేపథ్యంలో వీటిని సేకరించి ఆ భూ ములను పారిశ్రామిక అవసరాలకు వినియోగిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రం కాకినాడకు ఆనుకుని ఇవి ఉండడం, మ రికొన్ని 216జాతీయరహదారిని ఆనుకుని ఉన్నా యి. దీంతో పలు కంపెనీలకు వీటిని కేటాయిం చి పారిశ్రామిక అవసరాలు తీర్చాలని భావిస్తోం ది. దీంతో ఈ 1245.28 ఎకరాల భూములను తమకు విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం కొన్ని నె లల కిందట చెన్నైలోని డిప్యూటీ సాల్ట్‌ కమిషన ర్‌ను కోరింది. కమిషన వినియోగించనందున, రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఏపీ మారిటైం బోర్డు కు భూములను బదలాయించాలని కోరింది. దీంతో కమిషన స్పందించి ఆ భూములకు ధర ఎంత చెల్లిస్తారో తెలియజేస్తే సమ్మతి ప్రకారం మారిటైం బోర్డుకు భూములు అప్పగిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ భూముల ధరను నిర్ణయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈఏడాది జూ నలో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కొన్ని నెలలుగా కరప, తాళ్లరేవు, కాకినాడ మండలాల పరిధిలోని ఉప్పు భూములను పరిశీలించింది. ఆయా మండలాల తహసీల్దార్లు, సబ్‌ రిజిసా్ట్రర్లు వీటిని అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ విలువ, ప్రభుత్వ ధరలను పరిగణనలోకి తీసుకుని కసరత్తు జరిపారు. ఈ మేరకు ఆ భూములకు ఎంత ధర చెల్లించవ చ్చనేదానిపై పలు కోణాల్లో విశ్లేషించి జేసీకి నివేదిక అందజేశారు.వీటిని మరోసారి అధ్యయ నంచేసిన కలెక్టర్‌ ఎట్టకేలకువీటికి ధర నిర్ణయిం చారు. ఉప్పు భూముల వినియోగం అనుకూల త, ప్రభుత్వధరలు, మార్కెట్‌ పరిస్థితులు అన్నీ కూలంకుషంగా చర్చించి ఎకరాకు రూ.6.50లక్ష ల ధర నిర్ణయించారు. మొత్తం 1,245.28 ఎకరా లకు రూ.80.92కోట్ల వరకు చెల్లించడానికి సమ్మ తి ప్రకటించారు. ఈమేరకు జిల్లాస్థాయి అధికా రుల కమిటీ నిర్ణయించిన ధరల ప్రతిపాదన లను చెన్నై డిప్యూటీ సాల్ట్‌ కమిషనకు కాకినాడ లోని సాల్ట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ అధి కారుల ద్వారా వివరించారు. గతంలో ఈభూ ముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. సాల్ట్‌ కమిషననుంచి స్పందన లేక భూకేటాయింపులు నిలిచిపోయాయి.

ఏం చేస్తారో..

జిల్లాస్థాయి అధికారుల కమిటీ నిర్ణయించిన ధరపై ఇప్పుడు చెన్నైలోని డిప్యూటీ సాల్ట్‌ కమిషనర్‌ కార్యాలయం ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖరారు చేసిన ధరపై సాల్ట్‌ కమిషన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ధర సరిపోతుందా? లేదా? అనేది తేల్చి చెప్పాల్సి ఉంది. ఈ భూములపై కొంతకాలం కింద చెన్నైనుంచి సాల్ట్‌ కమిషన కార్యాలయంనుంచి కొందరు అధికారులు పరిశీలన జరిపారు. చొల్లంగి, పెనుగుదురు ప్రాంతాల్లో పర్యటించి హైవేను ఆను కునిఉన్న భూములు కావడంతో ధర భారీగా వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.6.50లక్షలు ఖరారుతో ఆ ధరకు సాల్ట్‌ కమిషన ఎలా స్పందిస్తుందనేది చూడాల్సిఉంది. సరిపోదు పెంచాలని కోరితే కొంత పరి గణనలోకి తీసుకునే అవకాశం ఉందా?అనేది అధికారుల కమిటీ తేల్చాలి. సాధ్యమైనంత తొందర్లోనే ధరకు సంబంధించి సాల్ట్‌ కమిషన నుంచి స్పష్టత రానుంది. ఉప్పు భూముల్లో పారిశ్రామికపార్కు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులోను సాల్ట్‌భూములను కంపెనీలకు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది.

Updated Date - Nov 05 , 2025 | 01:02 AM