Share News

‘సాక్షి’ ప్రతుల దహనం

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:08 AM

రాజధాని అమరావతి మహిళలపై అస భ్యంగా మాట్లాడిన సాక్షి యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానంలో బెయిల్‌ రావడంతో రాజమహేంద్రవరంలో తెలుగు మహిళలు ఆగ్రహించారు. శుక్రవారం సాయత్రంం స్థానిక షెల్టాన్‌ సెంటర్‌లో తెలుగు మహిళా పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియల సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు నిరసన నిర్వహించారు.

‘సాక్షి’ ప్రతుల దహనం
సాక్షి ప్రతులను దహనం చేస్తున్న తెలుగు మహిళలు

  • కొమ్మినేనికి బెయిల్‌ రావడంపై తెలుగు మహిళల ఆగ్రహం

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 13(ఆంధ్ర జ్యోతి): రాజధాని అమరావతి మహిళలపై అస భ్యంగా మాట్లాడిన సాక్షి యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానంలో బెయిల్‌ రావడంతో రాజమహేంద్రవరంలో తెలుగు మహిళలు ఆగ్రహించారు. శుక్రవారం సాయత్రంం స్థానిక షెల్టాన్‌ సెంటర్‌లో తెలుగు మహిళా పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియల సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు నిరసన నిర్వహించారు. సాక్షి ప్రతులను దహనం చేశారు. సాక్షి లైవ్‌ కార్యక్రమంలో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అమరావతి మహిళను అసభ్యంగా మాట్లాడితే కొమ్మినేని అడ్డుకోలేదని, దానిని సా క్షి యాజమాన్యం కూడా ఖండించలేదన్నారు. బెయిల్‌పై విడుదలైన కొమ్మినేనిని ప్రజా ఉద్య మ పోరాట యోధుడిలా జగన్‌ స్వాగతించడం మహిళల పట్ల వారి నైజం మరోసారి బయట పడిందన్నారు. మహిళలను అగౌరవ పరిచిన సాక్షిని బ్యాన్‌ చేయాలని తెలుగు మహిళలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కప్పల వెలు గుకుమారి, మీసాల నాగమణి, బోను ఈశ్వరి, లీలావతి, తుళ్లి పద్మ, దొంగ నాగమణి, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, కర్ణం లక్ష్మీనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:08 AM