త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:50 AM
అంతర్వేది, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సఖినేటిపల్లి-నర్సాపురం రేవులో నిత్యం ప్రయాణికులతో పంటు రాకపోకలు రద్దీగా జరుగుతాయి. అయితే శనివారం అల
సఖినేటిపల్లి రేవులో అదుపు తప్పిన పంటు
ఒడ్డుకు చేర్చిన డ్రైవర్
అంతర్వేది, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సఖినేటిపల్లి-నర్సాపురం రేవులో నిత్యం ప్రయాణికులతో పంటు రాకపోకలు రద్దీగా జరుగుతాయి. అయితే శనివారం అలల ఉధృతి కారణంగా పంటు అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో పంటును ఒడ్డుకు చేర్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చించినాడ వంతెన మరమ్మతుల నేపథ్యంలో బస్సులకు రాకపోకలు నిలిపి వేయడంతో సఖినేటిపల్లి రేవు మీదుగా నర్సాపురం చేరుకునేందుకు ప్రయాణికులు అధికంగా ఉండడంతో, అలల ఉధృతి కూడా పెరగడంతో పంటు అదుపుతప్పింది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంటు డ్రైవర్ నేర్పుతో పంటును ఒడ్డుకు చేర్చాడు. ఇప్పటికైనా అధికారులు ఓవర్ లోడ్ వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.