Share News

26న యానాంలో సాహితీ పురస్కారాల ప్రదాన సభ

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:33 AM

యానాం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాం ప్రతీఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వ హించే శిఖామణీ సాహితీ పురస్కారాల ప్రదాన సభ, కవిసంధ్య దశాబ్ది ఉత్సవం ఈనెల 26న యానాం డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కల్యాణ మండపంలో జరగనుంది. శి ఖామణీ జీవన సాఫల్య పు

26న యానాంలో సాహితీ పురస్కారాల ప్రదాన సభ

యానాం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాం ప్రతీఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వ హించే శిఖామణీ సాహితీ పురస్కారాల ప్రదాన సభ, కవిసంధ్య దశాబ్ది ఉత్సవం ఈనెల 26న యానాం డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కల్యాణ మండపంలో జరగనుంది. శి ఖామణీ జీవన సాఫల్య పురస్కారం ప్ర ముఖ కవి, రచయిత, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌... యువ పురస్కారం ప్రము ఖ కవి, విమర్శకుడు అవధానుల మణిబా బు అందుకోనున్నారు. కవిసంధ్య అధ్యక్షు డు కళారత్న డాక్టర్‌ శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్ర త్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలుగుభాషా సంస్కృతుల ప్రేమికుడు మండలి బుద్ద ప్రసాద్‌, ప్రము ఖ పద్యకవి ఆజోవిభో కంధాళం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ప్రముఖకవి రచయిత దాట్ల దేవదానం రాజు, ప్రముఖ సాహితీవేత్తలు మధునాపంతుల సత్యనారాయణమూర్తి, డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు, డాక్టర్‌ కాళ్ళకూరి శైలజ, బొల్లోజుబాబా, కుంచే నాగసత్యనారాయణ, సీహెచ్‌రాం, డాక్టర్‌ గూటం స్వామి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కవిసంధ్య- ఆరుద్ర, బైరాగి శత జయంతి సంచిన ఆవిష్కరణ జరగనుంది.

కవిసంధ్య ప్రతిభా పురస్కార గ్రహీతలు వీరే..

సుమారు 10మందికి (వచన, అభ్యు దయ, పత్రికా, లఘుకవిత, దళిత సాహి త్యం) ముఖ్య అతిథుల చేతులమీదుగా కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిలో డాక్టర్‌ కోటేశ్వరారావు, ఎస్‌.ఆర్‌.పృ థ్వీ, పీఆర్‌ఎల్‌.స్వామి, బీహెచ్‌వి.మంగేష్‌, డాక్టర్‌ వరుగు భాస్కరెరెడ్డి, పచ్చిమాల శివనాగరాజు, పుప్పాల సూర్యకుమారి, పోనుగుమట్ల అశోక్‌కుమార్‌, పెనుమాక రత్నాకర్‌, మిరప మహేష్‌లు ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:33 AM